Suma: చెక్ కొట్టేసింది.. సుమని మోసం చేసిన డైరెక్టర్.. కేసు పెడతానంటున్న యాంకర్.?

The director who cheated on Suma
The director who cheated on Suma

Suma: ఏంటి సుమని డైరెక్టర్ మోసం చేశారా.. నిజంగానే కేసు పెడుతుందా.. తాజా ఈవెంట్లో సుమ ఏం మాట్లాడింది..ఆమె మాటలు వెనుక ఉన్న అర్థం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..తాజాగా సుమ కనకాల చాలా రోజుల తర్వాత మళ్లీ సినిమాల్లో ఒక కీ రోల్ పోషిస్తుంది. అదేంటంటే ప్రియదర్శి,ఆనంది హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ప్రేమంటే అనే సినిమాలో పవర్ఫుల్ కానిస్టేబుల్ రోల్ పోషిస్తుంది. అయితే ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది యాంకర్ సుమ.

The director who cheated on Suma

ఆమె ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ఎప్పుడు నేనే మీ అందరిని పిలుస్తూ పలకరిస్తూ సందడి చేసేదాన్ని. కానీ ఇప్పుడు నా పాత్రని యాంకర్ గీత కొట్టేసింది. నా చెక్కు కూడా కొట్టేసింది.. ఇక ప్రేమంటే సినిమాలో మొదట నన్నే హీరోయిన్ గా తీసుకుంటానని డైరెక్టర్ చెప్పారు.కానీ ప్రియదర్శి కంటే నా వయసు చాలా తక్కువని పక్కన పెట్టేశారు. ఆ తర్వాత ఆనందిని హీరోయిన్గా తీసుకున్నారు.. ఇక ఇందులో ఆనంది కంటే నేనే గ్లామర్ గా కనిపించాను. అలాగే ఈ సినిమాలో నన్ను ఓ పవర్ఫుల్ కానిస్టేబుల్ రోల్ కి తీసుకుంటానని డైరెక్టర్ చెప్పారు.(Suma)

Also Read: Devi Sri Prasad: పెళ్లిపై దేవి శ్రీ ప్రసాద్ ఊహించని కామెంట్స్.. ఇక లైఫ్ లో అది జరగదు.!

కానీ ఒక సన్నివేశం చేశాకే పవర్ లెస్ కానిస్టేబుల్ అని అర్థమైంది.ఈ విషయంలో నేను దర్శకుడి మీద కేసు పెట్టాల్సిందే.కానీ ఆ డైరెక్టర్ కి ఇంకా పెళ్లి కాలేదు అని వదిలేసాను.ఎందుకంటే డైరెక్టర్ పెళ్లి చేసుకుంటే అంతకంటే పెద్ద కేసు ఏముంటుంది. ఇక ఈ సినిమాలో నాకోసం కూడా ఒక పాట ఉంది. ఆ పాటలో నేను కూడా డాన్స్ చేశాను. అందులో ఒక హుక్ స్టెప్ ఉంది.ఆ పాట రిలీజ్ అయ్యాక అందరూ ఆ హుక్ స్టెప్ చేయాలి. ఆనంది నువ్వు నా పాత్రని కొట్టేసావు..కానీ ఇట్స్ ఓకే.. సరిపెట్టుకుంటాను.

The director who cheated on Suma

అలాగే ఈ సినిమాలో బాగా నటించావు.కానీ నీకంటే ఈ సినిమాలో నేనే గ్లామర్ గా కనిపించాను అంటూ తన మాటలతో అక్కడున్న వారందరికీ నవ్వులు తెప్పించింది యాంకర్ సుమ. అలా యాంకర్ కాకపోయినా కూడా సుమ స్టేజ్ మొత్తాన్ని తన మాటలతో రఫ్పాడించింది.ప్రస్తుతం సుమ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.ఇక జయమ్మ పంచాయతీ మూవీ తర్వాత సుమ ప్రేమంటే అనే మూవీతో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించబోతుంది.(Suma)

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu