Saloon Shop: సెలూన్ షాప్ లో కటింగ్ చేయించుకుంటున్నారా .. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి ?

Saloon Shop: సెలూన్ షాప్, ప్రతి గల్లీలో ఉంటుంది. ఈ సెలూన్ షాప్ లో మగాళ్లు ఎక్కువగా వెళ్లి కటింగ్ చేయించుకుంటారు. అయితే, ఈ సెలూన్ షాప్ లో కటింగ్ చేయించుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, ప్రమాదకరమైన వ్యాధులనుంచి దూరం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. కటింగ్ కోసం వెళ్లిన వెంటనే, ఆ సెలూన్ షాప్ వాడు తెల్లటి బట్ట కప్పుతాడు. Saloon Shop

instructions over Saloon Shop

దాన్ని శుభ్రంగా చేసి, కప్పాలని అతనికి ముందే చెప్పాలి. లేకపోతే ఇతరుల వెంట్రుకలు, మీ మీద పడే ప్రమాదం ఉంటుంది. అలాగే ఇతరులకు వాడిన తెల్లటి గుడ్డ, మీకు వాడితే చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా దురద సంబంధించి ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. ఇక కటింగ్ చేసిన తర్వాత కొంతమంది షేవింగ్ కూడా చేయమని చెబుతారు. షేవింగ్ చేసేటప్పుడు కొత్త బ్లేడ్ వాడుతున్నాడా ? లేదా అని చెక్ చేసుకోవాలి. అవసరమైతే ఆ షాప్ వాడిని బెదిరించి, కొత్తది పెట్టుకోవాలని చెబుతున్నారు వైద్యులు. ఇతరులకు వాడిన బ్లేడ్, వాడకూడదని చెప్పాలి. Saloon Shop

Also Read: WPL 2026 Schedule: WPL 2026 షెడ్యూల్ వ‌చ్చేసింది..ఉచితంగా ఇలా చూడండి

అప్పుడు హెచ్ఐవి లాంటి ప్రమాదకరమైన వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ఇక మసాజ్ చేసుకునేటప్పుడు, తలను తబలా వాయించినట్టు, ఆ సెలూన్ షాప్ వాడు వాయిస్తూ ఉంటాడు. అలా వేగంగా, ప్రమాదకంగా మసాజ్ చేయించుకున్న డేంజరే. మెడ నరాలకు ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంటుంది.కాబట్టి మసాజ్ కూడా స్మూత్ గా చేయమని చెప్పాలి. ఈ టిప్స్ పాటిస్తే ఎలాంటి వ్యాధులు సోకవు అంటూ వైద్యులు చెబుతున్నారు. Saloon Shop

Also Read: KCR: వైసీపీ-BRS మధ్య రాజకీయ పొత్తు.. కేసీఆర్ 3.0 లోడింగ్?