వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం తన రాజకీయ వ్యూహాల్లో సరికొత్త ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ స్టైల్ ని మిర్రర్ చేస్తూ Jagan 2.0 అనే ఫార్ములా తీసుకొచ్చారు. విజయ్ గెలుపు వెనుక ఉన్న కపిల్ సాహు, జాన్ ఆరోక్యసామిల వ్యూహాలనే ఇప్పుడు జగన్ కూడా యూజ్ చేస్తున్నారని టాక్. అలాగే టీవీకే పార్టీకి స్పెషల్ యాప్ ఉన్నట్టే, వైసీపీ కూడా Jagan 2.0 యాప్ ను గురువారం రిలీజ్ చేసింది. ఈ యాప్ డిజైన్, ఫీచర్లు మొత్తం మై టీవీకే యాప్ కాపీ అని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.
Jagan 2.0 Strategy Copy Success?
విజయ్ తన ఎన్నికల క్యాంపెయిన్ లో డైరెక్ట్ కేడర్ కనెక్షన్ కోసం యాప్ ని ఎఫెక్టివ్ గా యూజ్ చేశారు. ఇప్పుడు జగన్ కూడా సూపర్ యాప్ ద్వారా కింది స్థాయి కార్యకర్తలతో డైరెక్ట్ కమ్యూనికేషన్ పెంచాలని చూస్తున్నారు. 2019 లో ప్రశాంత్ కిశోర్ స్ట్రాటజీ తో గెలిచిన జగన్, ఈ సారి కపిల్ సాహు టీమ్ ని హైర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ డిస్కషన్స్ కొన్ని రౌండ్లు జరిగాయని, త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావచ్చని సమాచారం.
విజయ్ ఒంటరి పోరాటం చేసి ఫస్ట్ టైం లోనే సీఎం అయ్యారు. అదే మోడల్ ను జగన్ కూడా ఫాలో అవుతూ, ఎటువంటి ఎలక్షన్ అలయన్స్ లేకుండా సింగిల్ హ్యాండెడ్ గా పోటీ చేయాలనుకుంటున్నారు. కానీ ఈ కాపీ కొట్టిన వ్యూహాలు నిజంగా పనిచేస్తాయా అనేది పెద్ద ప్రశ్న. 2029 ఎన్నికల్లో తమిళనాడు ఫార్ములా ఆంధ్రాలో సక్సెస్ అవుతుందా లేదా అనే దానిపై రాజకీయ విశ్లేషకులు కుతూహలంగా ఎదురుచూస్తున్నారు.
మొత్తంగా, జగన్ ప్రస్తుతం విజయ్ రోడ్ మ్యాప్ ని ఎక్జాక్ట్ గా ఫాలో అవుతున్నారు. యాప్ డెవలప్ మెంట్ నుంచి స్ట్రాటజిస్ట్ సెలక్షన్ వరకు అన్నీ విజయ్ సక్సెస్ స్టోరీ బేస్ చేసుకునే ఉన్నాయి. ఈ కాపీ కొట్టిన వ్యూహంతో వైసీపీ నెక్ట్స్ ఎలక్షన్ లో ఎంత మేరకు ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి.





