Vijay: విజయ్‌ ఇంటికి బాంబు బెదిరింపులు

Vijay

Vijay: తమిళ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కి మ‌రో ఊహించ‌ని షాక్ త‌గిలింది. తమిళ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఇంటికి బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. చెన్నై – నీలాంగరైలోని విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఆదివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో రాష్ట్ర డీజీపీ ఆఫీసుకు ఈ–మెయిల్ చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. Vijay

Bomb threats to Vijay’s house

దీంతో అప్రమత్తమైయ్యారు త‌మిళ‌నాడు పోలీసులు. ఇందులో భాగంగానే… విజయ్ ఇంట్లో తనిఖీలు చేయగా, పేలుడు పదార్థాలు ఏమి లభించలేదని తెలిపారు పోలీసులు. కాగా కరూర్ విజయ్ సలో తొక్కిసలాట దుర్ఘటనలో నలుగురు టీవీకే పార్టీ నాయకులపై కేసులు నమోదు చేసిన పోలీసులు… ద‌ర్యాప్తు చేస్తున్నారు. Vijay

Also Read: Abhishek Sharma: గిల్ కు ఎసరు…సారా టెండుల్కర్ ను ఫాలో అవుతున్న అభిషేక్ శర్మ…

ఇక అటు తొక్కిసలాట ఘటనపై మద్రాసు హైకోర్టులో పిటీషన్ వేసింది హీరో విజయ్ టీవీకే పార్టీ. పోలీసుల లాఠీ ఛార్జ్ వల్లే తొక్కిసలాట జరిగిందని, ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని టీవీకే పిటిషన్ దాఖ‌లు చేశారు. టీవీకే పిటిషన్‌పై నేడు విచారణ జరపనుంది మద్రాస్ హైకోర్టు. కాగా… ఈ సంఘ‌ట‌న‌లో 40కి పైగా మంది మ‌ర‌ణించారు.

Also Read: Popula Pette: పోపుల పెట్టెలో ఈ వస్తువులను ఉంచుతున్నారా.. అయితే డేంజర్ లో ఉన్నట్టే…

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu