
Vidadala Rajini: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీకి సంబంధించిన నేతలపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో మంత్రిగా పదవులు అనుభవించి, స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న లీడర్లను ప్రభావితం చేస్తోందట భారతీయ జనతా పార్టీ. ఇందులో భాగంగానే విడదల రజినీని టార్గెట్ చేసిందట బిజెపి. Vidadala Rajini
Vidadala Rajini into bjp party
తమ పార్టీలోకి రావాలని ఇప్పటికే బీజేపీ పెద్దలు బంపర్ ఆఫర్ ఇచ్చారట. బిజెపి పార్టీలోకి వస్తే, కీలక పదవులు ఇస్తామని కూడా వెల్లడించిందట. లేకపోతే స్కాములు బయటకు తీస్తామని వార్నింగ్లు ఇస్తున్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనికి విడదల రజిని గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. దీనిపై భార్యాభర్తలు ఇద్దరు చర్చలు చేస్తున్నారట. Vidadala Rajini
Also Read: KCR: జూబ్లీహిల్స్ లో ఓడిపోతే, KCR ఫ్యామిలీ మొత్తం అరెస్ట్?
పార్టీ క్యాడర్ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట. కానీ చిలకలూరిపేట వైసిపి కార్యకర్తలు మాత్రం విడదల రజిని వెనక నడిచేందుకు ఆసక్తిగా లేరని తెలుస్తోంది. మరి భార్యాభర్తలు ఇద్దరైనా బిజెపి పార్టీలో చేరుతారా? లేదా వైసిపి పార్టీతో నడుస్తారా ? అనే చర్చ జరుగుతోంది. కాగా టీడీపీ పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన విడదల రజిని, వైసీపీ పార్టీలోకి వచ్చారు. చిలకలూరిపేట నుంచి పోటీ చేసి, 2019లో విజయం సాధించారు. జగన్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. Vidadala Rajini
Also Read: RCB: చిన్నస్వామిలో నో ఐపీఎల్..షాక్ లో బెంగళూరు ఫ్యాన్స్?





