
I-Bomma Ravi Father: రెండు తెలుగు రాష్ట్రాలలో ఐ బొమ్మ రవికి ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతుంది. అందరూ కలిసి లాయర్ కు ఫీజు ఇవ్వాలంటూ కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. జైల్లో ఉన్న I-Bomma రవిని ఎలాగైనా విడిపించాలని సోషల్ మీడియాలో అందరూ కామెంట్లు కూడా పెడుతున్నారు. అయితే ఐ బొమ్మ రవి తండ్రి మాత్రం అతనికి వ్యతిరేకంగా మొన్నటి వరకు మాట్లాడారు. I-Bomma Ravi Father
I-Bomma Ravi Father counter to c kalyan
తన కొడుకు చేసింది తప్పేనని, పైరసీ చేయడం చాలా అన్యాయం అంటూ ఐ బొమ్మ రవి తండ్రి అప్పారావు వెల్లడించారు. అయితే తాజాగా అదే అప్పారావు.. తన కొడుకుకు మద్దతుగా నిలిచారు. కోట్లు ఖర్చుపెట్టి సినిమా ఎవడు తీయమన్నాడంటూ అప్పారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. I-Bomma రవిని ఎన్కౌంటర్ చేయాలని నిర్మాత సి కళ్యాణి ఇటీవల వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అతనికి కౌంటర్ ఇచ్చారు అప్పారావు. నా కొడుకుని ఎవర్రా ఎన్కౌంటర్ చేసేది అని రెచ్చిపోయారు. ఆయనను ఎన్కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది అంటూ సి కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు. I-Bomma Ravi Father
ALSO READ: KCR: కేసీఆర్ కు ఉన్న ధైర్యం చంద్రబాబుకు ఉందా? కేటీఆర్ లాగా ఉప ఎన్నికను…
సినిమాలో విషయం ఉంటే జనం కచ్చితంగా చూస్తారని తెలిపారు. నేను 45 పైసలతో సినిమా చూశానని, కానీ ఇప్పుడు రేట్లు 1000 దాటిపోయాయని మండిపడ్డారు. కోట్లు ఖర్చుపెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు… టికెట్ల ధరలు ఎవరు పెంచుమన్నారు అని ఆగ్రహించారు. తన కొడుకు తరఫున వాదించే న్యాయవాదులకు ఆర్థిక సహాయం చేస్తానని తాజాగా ప్రకటన చేశారు అప్పారావు. దీంతో ఐ బొమ్మ ఎపిసోడ్ మళ్లీ హాట్ టాపిక్ అయింది. I-Bomma Ravi Father
ALSO READ: Vaibhav suryavanshi: సున్నాకే 2 వికెట్లు.. వైభవ్ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదంటూ ట్రోలింగ్?

