Telangana: రేవంత్ రెడ్డి స‌ర్కార్ కు మ‌రో షాక్‌..ఆ మంత్రి కొడుకు భూ క‌బ్జా, 70 బౌన్స‌ర్ల‌తో ?

Telangana: ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ప్రజలే స్వయంగా చెబుతున్నారు. మైక్ ముందట పెడితే చాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి దుమ్మెత్తి పోస్తున్నారు ప్రజలు. దానికి తగ్గట్టుగానే గులాబీ పార్టీ కూడా కాంగ్రెస్ వైఫల్యాలను గ్రౌండ్ స్థాయిలోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అవుతోంది. Telangana

Another shock for Telangana Revanth Reddy government Ministers son grabs land with 70 bouncers

ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ కేబినెట్లో ఉన్న ఓ మంత్రి కొడుకు వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.భూ కబ్జాలకు తెగబడ్డ ఆ మంత్రి కొడుకు…. 70 మందికి పైగా బౌన్సర్లతో వెళ్లి మూడెకరాల భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడ కూల్చివేసిన‌ట్లు కూడా ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అడ్డుకున్న స్థలం యజమానిపై దాడికి పాల్ప‌డిన‌ట్లు చెబుతున్నారు. అయినా కూడా స్థానిక పోలీసులు పట్టించుకొలేద‌ని అంటున్నారు. గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని వట్టి నాగులపల్లిలో భూ కబ్జాకు యత్నించార‌ట ఆ తెలంగాణ మంత్రి కొడుకు. Telangana

Also Read: Komatireddy Venkat Reddy: సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా..పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడవు

అయితే, ఈ త‌రుణంలోనే బలగాలతో వెళ్లి బౌన్సర్లను అదుపులోకి తీసుకొని, మంత్రి కొడుకుపై కేసుకు సిద్ధమ‌య్యాడ‌ట‌ ఓ పోలీస్ ఉన్నతాధికారి. దీంతో ప్రైవేటు వ్యవహారంలో పోలీసుల జోక్యమేంటని.. కేసుకు సాహసించిన ఉన్నతాధికారిపై సస్పెండ్ వేటుకు ముఖ్యనేత రెడీ అయిన‌ట్లు ప్ర‌చారం జోరు అందుకుంది. అలా చేస్తే ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని, మరింత బదనాం అవుతామన్న హెచ్చరికలతో వెనక్కి తగ్గార‌ట స‌ద‌రు మంత్రి. దీంతో ఇరు వర్గాలపై తూతూ మంత్రంగా కేసులు నమోదు అయిన‌ట్లు స‌మాచారం. Telangana

Also Read: PM MODI: భార‌త పౌరుల‌కు బిగ్ షాక్‌..ప్రధాని మోదీ అతిపెద్ద కుట్ర..?

Share your love