KCR: కేసీఆర్ ఒక్క కామెంట్…గులాబీ పార్టీకి ఆక్సిజ‌న్‌, ఇక దూకుడే

KCR
KCR

KCR: తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీకి మళ్ళీ కొత్త ఊపు వచ్చింది. కెసిఆర్ తాజాగా ఒక్క స్టేట్మెంట్ చేసిన నేపథ్యంలో మళ్లీ గులాబీ పార్టీ వైపు జనాలు మళ్ళినట్లు తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికల హడావిడి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం మూడు విడతల్లో తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. KCR

KCR one comment oxygen for the Pink Party, now its time to jump

డిసెంబర్ 11, 14,17 తేదీలలో స్థానిక సంస్థలు ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో గులాబీ పార్టీకి కొత్త ఊపు తెచ్చేందుకు కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. మళ్లీ వచ్చేది గులాబీ పార్టీ ప్రభుత్వమే అంటూ కేసిఆర్ సంచలన ప్రకటన చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన కొంతమంది సర్పంచ్ అభ్యర్థులను పిలిపించుకొని సమావేశమయ్యారు కేసీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చేది గులాబీ పార్టీ ప్రభుత్వమేనని, తిరిగి మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు. KCR

Also Read: KCR: కేసీఆర్ చెంత‌కు వ‌రంగ‌ల్ లీడ‌ర్లు..ఇక కారు జోరును ఆప‌లేరు ?

ప్రజలు ఎవరు కూడా అధైర్య పడకూడదని వెల్లడించారు. అన్ని కులాలు మనకు అనుకూలంగా ఉండబోవాని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏదో చేస్తారంటూ ఆశలు పెట్టుకొని ఆగం కావద్దని గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దీంతో గులాబీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ పాజిటివ్ మూమెంట్స్ వచ్చినట్లు సమాచారం అందుతోంది. సర్వేలన్నీ కూడా గులాబీ పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. కెసిఆర్ చేసిన ఆ రెండు వ్యాఖ్యలు గులాబీ పార్టీకి ఊపిరి పోసాయట. KCR

Also Read: Revanth Reddy: ఆ ఒక్క కామెంట్ తో కాంగ్రెస్ ను బొందపెట్టిన రేవంత్ ?

Share your love