
KCR: తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీకి పూర్వ వైభవం వచ్చేలా కనిపిస్తోంది. మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికలు అలాగే 2024 పార్లమెంటు ఎన్నికల సమయంలో కేసీఆర్ను కాదని కాంగ్రెస్ అలాగే బీజేపీ పార్టీలలోకి వెళ్లిన నేతలు అందరూ ఘర్ వాపస్ అవుతున్నారు. ముఖ్యంగా వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ లీడర్లు మళ్లీ గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. KCR
warangal leaders may join in KCR party
గత ఏడాది కిందట గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీలోకి వెళ్లారు ఆరూరి రమేష్. ఈ నేపథ్యంలోనే 2024 పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆరూరి రమేష్. ఆయన ఇప్పుడు మళ్లీ కెసిఆర్ వద్దకు వస్తున్నారట. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తే ఆ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట. దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నేతకావడంతో స్టేషన్ ఘనపూర్ టికెట్ ఆశిస్తున్నారట ఆరూరి రమేష్. అయితే ఇప్పటికే తాటికొండ రాజయ్య అక్కడ ఉన్నారు. KCR
Also Read: Revanth Reddy: సీఎం రేవంత్ కు జర్నలిస్ట్ వెన్నుపోటు..బీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్ గా ?
అతని కాదని ఆరూరి రమేష్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. అయినప్పటికీ గులాబీ పార్టీ కండువా కప్పుకునేందుకే ఆరూరి రమేష్ సిద్ధమవుతున్నారట. ఇక ఇటు పసునూరి దయాకర్ పార్లమెంటు ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ కండువా తప్పుకున్నారు. ఆయన కూడా గులాబీ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారట. వచ్చే పార్లమెంట్ ఎన్నికల సమయానికి గులాబీ పార్టీ అభ్యర్థిగా తనను ప్రకటించాలంటూ వేడుకుంటున్నారట. దీంతో గులాబీ పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది. అయితే ఈ ఇద్దరు లీడర్లను కేసీఆర్ చేర్చుకునేందుకే సిద్ధమవుతున్నట్లు సమాచారం. KCR
Also Read: Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోనున్న పవన్ కళ్యాణ్ ?





