“కూలీ”కి A సర్టిఫికెట్, కలెక్షన్స్ మీద ఎఫెక్ట్

రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ దక్కింది. సినిమాలో హింస ఎక్కువగా ఉండటంతో A సర్టిఫికెట్ తప్పలేదు. కూలీ సినిమా వసూళ్ల మీద ఇది ఎఫెక్ట్ చూపించనుంది. రజినీకాంత్ సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్ చూస్తారు. కానీ A సర్టిఫికెట్ తో పిల్లలను థియేటర్స్ లోకి అనుమతించరు. ఇది డిస్ అడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు.

ఆగస్టు 14న థియేటర్స్ లోకి రాబోతున్న కూలీ సినిమా ప్రస్తుతం ప్రమోషన్స్ యాక్టివిటీస్ జరుపుకుంటోంది. ఈ రోజు ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. నాగార్జున విలన్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్, ఉపేంద్ర సహా పలువురు స్టార్ కాస్టింగ్ నటిస్తున్నారు. కూలీ మీద భారీ హైప్ క్రియేట్ అవుతోంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. కూలీతో బాక్సాఫీస్ వద్ద హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వార్ 2 పోటీ పడుతోంది.

Share your love