బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటించిన వార్ 2 అంచనాలను అందుకోలేకపోయింది. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2 ఫ్లాప్ దిశగా వెళ్తోంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఆమధ్య రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వెకేషన్ లో ఉన్నారు. ఆయన విదేశాల నుంచి బయటకు వచ్చిన తర్వాత తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ఇందులో ఎన్టీఆర్ ను ఇప్పటి వరకు ఎవరూ చూపించని విధంగా చాలా పవర్ ఫుల్ గా చూపించబోతున్నారు. ప్రస్తుతం డ్రాగన్ మీదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. వచ్చే జూన్ 25న డ్రాగన్ మూవీ రిలీజ్ కానుంది.





