హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) నిర్వహించిన టీజీ-20 టోర్నమెంట్ తెలంగాణ క్రికెట్‌లో సంచలన విజయంగా నిలిచింది. ఒకప్పుడు వివాదాలతో ముడిపడి ఉన్న HCA, ఇప్పుడు ఈ టోర్నీతో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. 21 రోజుల పాటు సాగిన ఈ లీగ్‌కు గ్రాండ్ ఫినాలేతో ఘనంగా ముగింపు పలికింది, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.
Telangana Cricket HCA sets new benchmark
టీజీ-20 లీగ్ జూన్ 21న మొదలై, 8 జట్లు మరియు 32 మ్యాచ్‌లతో ఉప్పల్ స్టేడియాన్ని క్రికెట్ పండుగగా మార్చింది. సుమారు 3 లక్షల మంది అభిమానులు నేరుగా మ్యాచ్‌లను వీక్షించగా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో 300 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. ఫైనల్‌లో హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది, ప్రైజ్ మనీ కింద విజేతకు 1 కోటి, రన్నరప్‌కు 50 లక్షలు అందించారు.
ఈ టోర్నీ ప్రత్యేకత ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన యువకులకు పెద్ద వేదికను కల్పించడం. HCA ఈ ఇనీషియేటివ్ తీసుకోవడం ద్వారా దాగి ఉన్న ప్రతిభను వెలికితీసింది. రిటైర్డ్ జస్టిస్ నవీన్ రావు పర్యవేక్షణలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా టోర్నీ విజయవంతంగా నిర్వహించడం HCAకు ప్రశంసలు తెచ్చిపెట్టింది.
తొలి సీజన్‌తోనే టీజీ-20 HCA నిర్వహణలో సక్సెస్ స్టోరీగా నిలిచింది. ఇది తెలంగాణ క్రికెట్‌కు కొత్త బ్రాండ్‌ను సృష్టించింది. రాబోయే రోజుల్లో ఇలాంటి ఈవెంట్స్ మరింత మంది స్టార్ ప్లేయర్లను అందించడానికి వేదికగా మారనుంది.





