Ankle Under Thigh: హాయిగా అనిపించే ఈ అలవాటు ఎందుకు ప్రమాదకరం?

thigh

మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంది, కూర్చున్నప్పుడు కాలుని తొడ కిందకి మడిచి ఉంచటం. మనం తరచుగా చేసే ఈ పొజిషన్ ‘Ankle Under Thigh’ అని పిలుస్తారు. ఇది హాయిగా అనిపించినా, మీ వెన్నెముకకు నిజంగా హాని చేస్తుందా అని నిపుణులు అంటున్నారు. ఈ పొజిషన్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది, ముఖ్యంగా డెస్క్ జాబ్ చేసేవారు దీన్ని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. అయితే ఈ అలవాటు వల్ల తుంటి, వీపు మీద ఒత్తిడి పెరిగి రానున్న రోజుల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కిరణ్ షెటే హెచ్చరించారు.

Ankle Under Thigh Causes Spine Damage Risks

ఈ అలవాటు వల్ల శరీరానికి ఎలాంటి నష్టం వాటిల్లుతుందో వివరిస్తూ, జూపిటర్ హాస్పిటల్ కి చెందిన డాక్టర్ ప్రియాంక్ పటేల్ మాట్లాడారు. ఒక వైపు కాలు మడవటం వలన, పెల్విస్ ఒక వైపుకి వంగి, వెన్నెముక మీద ప్రెషర్ అసమానంగా పడుతుంది. అప్పుడప్పుడు ఇలా కూర్చోవడం వల్ల పెద్ద ప్రమాదం లేదు కానీ, ప్రతి రోజు గంటల తరబడి దీన్ని రిపీట్ చేయడం వల్ల కండరాల అసమతుల్యత ఏర్పడుతుంది. దీని వలన క్రమంగా నడుము నొప్పి, దృఢత్వం వంటి సమస్యలు వస్తాయి. మన శరీరం ఎక్కువసేపు ఉండే పొజిషన్ కి అలవాటు పడిపోతుంది, అందుకే చిన్న చిన్న సర్దుబాట్లు చేయకపోతే ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది.

మీ కూర్చునే తీరు వల్ల సమస్యలు వస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి కొన్ని వార్నింగ్ సైన్స్ ఉన్నాయి. ఎక్కువసేపు కూర్చున్న తర్వాత నడుము నొప్పి రావడం, నిలబడ్డప్పుడు వంగడానికి ఇబ్బంది పడటం వంటివి సాధారణ లక్షణాలు. కొంతమందికి ఒక భుజం మరొక దాని కంటే ఎత్తుగా కనిపించడం, రిపీడెడ్ గా మెడ నొప్పి లేదా తలనొప్పి వంటి సమస్యలు కూడా రావచ్చు. ముఖ్యంగా డెస్క్ వర్క్ చేసేటప్పుడు ఈ సమస్యలు తీవ్రమైతే, వాకింగ్ లేదా పొజిషన్ మార్చినప్పుడు తేలికగా అనిపిస్తే, మీ సిట్టింగ్ హ్యాబిట్స్ ని వెంటనే మార్చుకోవాలి.

సరైన సిట్టింగ్ పోస్టర్ కోసం, నిపుణులు ‘పర్ఫెక్ట్ పొజిషన్’ కంటే న్యూట్రల్ పొజిషన్ మెయింటెయిన్ చేయడం మరియు రెగ్యులర్ గా కదలడం ముఖ్యం అంటున్నారు. మీ వీపు చైర్ కి పూర్తిగా ఆనుకుని, భుజాలు రిలాక్స్ గా ఉండేలా చూసుకోండి. రెండు పాదాలు నేల మీద ఫ్లాట్ గా ఉంచి, మోకాళ్ళు తుంటి స్థాయిలో ఉండేలా సర్దుబాటు చేసుకోండి. అలాగే కంప్యూటర్ స్క్రీన్ ని కంటి స్థాయిలో సెట్ చేసుకోవడం వల్ల మెడ ఒత్తిడి తగ్గుతుంది. మీ ఆరోగ్యం కోసం ఏదైనా న్యూ రొటీన్ మొదలుపెట్టే ముందు వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకండి.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu