సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్ ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కాలా చనా చాట్ రెసిపీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన పంచుకున్న ఈ నోస్టాల్జిక్ స్నాక్ రెసిపీ పాత తరాన్ని స్కూల్ రోజులకు తీసుకెళ్తుంది. ఇది సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో తయారయ్యే హెల్తీ స్నాక్. మార్కెట్‌లో దొరికే ప్రాసెస్డ్ స్నాక్స్‌కు ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్.
Simple Black Chana Chaat Recipe
ఈ వంటకం తయారు చేయడానికి ముందు కాలా చనాను రాత్రంతా నానబెట్టాలి. తర్వాత ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేయండి. అందులో అర టీస్పూన్ ఇంగువ, సన్నగా తరిగిన అల్లం, 2 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. తర్వాత పసుపు, ఎర్ర మిరప పొడి, ధనియాల పొడి వేసి బాగా కలపండి. ఇప్పుడు ఉడకబెట్టిన చనా, కసూరి మేతి, ఉప్పు, నీళ్ళు కలిపి మూత పెట్టి ఉడికించాలి. నీరు తగ్గాక స్టవ్ ఆఫ్ చేయండి.
ఇప్పుడు ఈ మసాలా చనాను ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. అందులో తరిగిన ఉల్లిపాయలు, ఉడికించిన బంగాళాదుంపలు, టమాటా, దోసకాయ వేయండి. మరో బౌల్‌లో బ్లాక్ సాల్ట్, కాల్చిన జీలకర్ర, చాట్ మసాలా, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మసాలా మిశ్రమాన్ని చనా మీద పోసి బాగా కలపండి. ఇంతే, మీ సింపుల్ కాలా చనా చాట్ రెడీ.
ఈ హెల్తీ రెసిపీని ఫ్యామిలీ గెదరింగ్స్‌లో సర్వ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇది టేస్టీ మాత్రమే కాకుండా న్యూట్రిషియస్ కూడా. చెఫ్ కునాల్ కపూర్ ఈ వంటకాన్ని సింప్లిసిటీ ఇన్ ఇట్స్ బెస్ట్ ఫార్మ్ అని అభివర్ణించారు. క్విక్ స్నాక్ కావాలనుకున్నప్పుడు ఈ కాలా చనా చాట్ పర్ఫెక్ట్ ఛాయిస్. ట్రై చేసి చూడండి.





