మహేశ్ కోసం అప్పటిదాకా ఆగాల్సిందే

మహేష్‌ బాబుతో, రాజమౌళి ఎస్ఎస్ఎంబీ 29 అనే పాన్ వరల్డ్ మూవీ రూపొందిస్తున్నారు. ఈ మూవీ తర్వాత మహేష్‌ బాబు సినిమా ఎవరితో అనేది అనౌన్స్ చేయలేదు కానీ మైత్రీ మూవీ మేకర్స్ మహేశ్ కు భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజమౌళితో చేస్తున్న సినిమా తర్వాత మహేష్‌ బాబుతో సినిమా చేయాలని ఈ సంస్థ ట్రై చేస్తోంది. అయితే మహేష్‌ బాబు మాత్రం ఇంకా ఏ నిర్ణయం చెప్పలేదని తెలిసింది.

మహేష్‌ బాబుతో సినిమా చేసే ఆలోచనలో ఉన్న డైరెక్టర్స్ లో సుకుమార్ ఉన్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగతో కూడా మహేష్‌ మూవీ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. బోయపాటి పేరు కూడా వినిపిస్తోంది. 2027లో మహేష్‌, రాజమౌళి మూవీ రిలీజ్ అని వార్తలు వస్తున్నాయి. మహేష్‌ నెక్ట్స్ మూవీ అంటే 2027 తర్వాత గానీ ఆలోచించడానికి లేదు.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu