
Water Cane: వాటర్ క్యాన్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. చాలామంది బయట మినరల్ వాటర్ కోసం వాటర్ క్యాన్లను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక వాటర్ తెచ్చుకునే ముందు వాటర్ క్యాన్ లను శుభ్రం చేసుకుని నీటిని తెచ్చుకుంటారు. ఇక వాటర్ క్యాన్లను కొంతమంది నెలల కొద్ది వాడుతూ ఉంటారు. మరి కొంతమంది కొన్ని సంవత్సరాల పాటు వాడుతారు. ఇక కొంతమంది అయితే అది పగిలిపోయే వరకు వాడుతూనే ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల ప్రమాదం వాటిల్లుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాటర్ క్యాన్లను కేవలం మూడు నెలల పాటు మాత్రమే వాడాలని చెబుతున్నారు. అంతకన్నా ఎక్కువ రోజులు వాటర్ క్యాన్లను వాడినట్లయితే ప్రమాదం వాటిల్లుతుందని చెబుతున్నారు. Water Cane
Also Read: Kim Jong-Un: కిమ్ ఎంతకు తెగించాడురా…. సినిమా షేర్ చేసినందుకు అందర్నీ చంపేశాడు… మొత్తం 300 మంది ?
They’ve been using the same water can for many days
వాటర్ క్యాన్లను ఎక్కువ రోజులు వాడినట్లయితే వాటర్ క్యాన్లలో బ్యాక్టీరియా ఆల్కలైన్ ఏర్పడి ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే చాలాకాలం ఒకే రకమైన క్యాన్ వాడినట్లయితే అందులో ఉన్న నీటిని తాగడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, జీర్ణసంబంధ సమస్యలు ఏర్పడే అవకాశాలు అధికంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అలాంటి నీటిని తాగడం వల్ల కడుపు నొప్పి, వాంతులు, వీరేచనాలు అవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక చాలా కాలం పాటు వాటర్ క్యాన్లను వాడడం వల్ల ఆరోగ్య పనితీరు పూర్తిగా దెబ్బతింటుంది. అలా చాలా రోజులపాటు ఒకే రకమైన క్యాన్లను వాడడం వల్ల రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. శరీరంలో బ్యాక్టీరియా పెరుగుతుంది. దానివల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు శరీరం అంతటా వ్యాపించుతాయి. Water Cane
Also Read: Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేకే సర్వే… ఆ పార్టీదే గ్రాండ్ విక్టరీ ?
శరీరం పనితీరు పూర్తిగా దెబ్బతింటుంది. జలుబు, దగ్గు లాంటి సమస్యలు అధికంగా పెరుగుతాయి. ఆ కారణంగా ఎక్కువ రోజుల పాటు ఒకే రకమైన వాటర్ క్యాన్లను వాడకూడదని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. రెండు మూడు నెలలకు మించి వాడినట్లయితే అనేక రకాల వ్యాధులు ఏర్పడతాయి. ఇక చాలామంది బయట వాటర్ ప్లాంట్ లలో నీటిని తెచ్చుకొని తాగుతారు ఇలా తాగడం వల్ల కండరాల పనితీరు దెబ్బతింటుంది. వాటర్ ప్లాంట్ లలో అధికంగా నీటిని శుభ్రపరిచే కెమికల్స్ వల్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. అలాంటి నీటిని తాగకూడదని వైద్యులు చెబుతున్నారు. వీలైనంతవరకు ఇంట్ల ఉండే పంపు నీటిని మాత్రమే తాగాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. ఇంట్లో ఉండే పంపు నీటిలో ఎలాంటి కలుషితమైన కెమికల్స్, పౌడర్లు కలవవు. అలాంటి నీటిని తాగినట్లయితే ఆరోగ్యం బాగుంటుంది.
Also Read: Ridge Gourd: బీరకాయ ప్రతిరోజు తింటున్నారా..అయితే ఒక్కరిసారి ఇవి తెలుసుకోండి?




















