Jubilee Hills By Election 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మ‌రో స‌ర్వే.. విజ‌యం ఎవ‌రిదంటే

Jubilee Hills By Election 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మ‌రో స‌ర్వే తెర‌పైకి వ‌చ్చింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే విజయం అంటూ ఈ స‌ర్వేలో తేలిన‌ట్లు స‌మాచారం అందుతోంది. 42.80% ప్రజల మద్దతుతో బీఆర్ఎస్ ముందంజలో ఉందని.. తన సర్వేలో కోడ్‌మో-కనెక్టింగ్ డెమొక్రసీ సంస్థ తేల్చి చెప్పిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. Jubilee Hills By Election 2025

Jubilee Hills By Election 2025 BRS MAy Win

అధికార కాంగ్రెస్ పార్టీ కన్నా 10.1 శాతం ఎక్కువ ఓట్లతో బీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేయనుందని వెల్లడించిన సర్వే… ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. కాంగ్రెస్‌కు 32.70%, బీజేపీకి 19.50% ప్రజల మద్దతు ఉండగా.. ఇతరులకు 5% మద్దతు ఉన్నట్లు చెప్తున్నాయి ఈ సర్వే లెక్కలు.

Also Read: Kim Jong-Un: కిమ్ ఎంతకు తెగించాడురా…. సినిమా షేర్ చేసినందుకు అందర్నీ చంపేశాడు… మొత్తం 300 మంది ?

రాబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో విజయఢంకా మోగించడం పక్కా అని పేర్కొంది కోడ్‌మో-కనెక్టింగ్ డెమొక్రసీ సంస్థ. ఇదే టైంలో.. 46.5 శాతం మంది మళ్లీ కేసీఆరే సీఎం కావాలని తమ అభీష్టాన్ని వెల్లడించారని స్పష్టం చేసింది ఆ సంస్థ. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలొస్తే.. కేసీఆర్‌కు 46.5%, రేవంత్‌ రెడ్డి 28.4% ఓటేస్తారని తేల్చి చెప్పింది నివేదిక.