
Aloe Vera Juice: కలబంద ఆయుర్వేదంలో ఎంతగానో పనిచేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో ప్రతి ఒక్కదానిలో కలబందను వాడతారు. కలబందను మందులలో, చర్మ సౌందర్యానికి అన్ని విధాలుగా దీనిని వాడుతూ ఉంటారు. కలబందను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కలబందలో కొవ్వులు, చక్కెరలను విచ్ఛిన్నం చేయడానికి సహాయం చేసే పోషకాలు ఉంటాయి. కలబందను తిన్నట్లయితే జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. కలబంద జ్యూస్ తాగినట్లయితే మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది. కలబంద మధుమేహ రోగులకు చాలా బాగా పనిచేస్తుంది. మధుమేహ రోగులకు రక్తంలో ఉండే చక్కర స్థాయిలు తొలగిపోతాయి. కలబంద జ్యూస్ తాగినట్లయితే కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. Aloe Vera Juice
Also Read: Komatireddy Raj Gopal Reddy: నేపాల్ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం కూల్చే ప్రమాదం ?
Healthy Benefits of Drinking Aloe Vera Juice
కలబందను అధికంగా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కలబందను తినడం వల్ల రక్తపోటు సమస్యలు తొలగిపోతాయి. కలబంద జ్యూస్ తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది కలబంద జ్యూస్ లో విటమిన్ సి, విటమిన్ ఏ, కాల్షియం, మెగ్నీషియం, ఖనిజాలు, జింక్, ఐరన్, కాపర్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో సహాయం చేస్తాయి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని ఎంతగానో బలపరుస్తుంది. కలబంద రసం చర్మాన్ని అందంగా ఉంచుతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ముడతలు, మచ్చలు, మొటిమలు లాంటి సమస్యలు తొలగిపోతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలతో పోరాడడానికి, చర్మపు సౌందర్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. కలబంద జ్యూస్ ను సబ్బులలో, షాంపులలో తప్పకుండా వాడతారు. ఇలా చేయడం వల్ల చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది.
Also Read: Nela Usiri: నేల ఉసిరి మొక్క గురించి మీకు తెలుసా..? ఇది తింటే 100…
కలబందను షాంపులలో అధికంగా వాడుతారు. దీని వల్ల జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు అధికంగా తొలగిపోతాయి. కలబందను నూనెలలో కూడా వాడుతూ ఉంటారు. ఈ నూనె జుట్టుకు పట్టించినట్లయితే జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. జుట్టు బలంగా, ఒత్తుగా తయారు అయ్యి ఆరోగ్యంగా పెరుగుతుంది. కలబందను ప్రతిరోజు ఉదయం పూట జ్యూస్ చేసుకుని తాగినట్లయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయని వైద్యనిపుణులు సూచనలు చేస్తున్నారు. దీని పైన ఉన్న తోలును తీసి లోపల ఉన్న గుజ్జును బాగా కడిగి కొన్ని పాలు, చక్కెర నీళ్లు వేసి జ్యూస్ చేసుకుని వడగట్టుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. బలంగా తయారవుతారు. ఎముకలు బలంగా ఉంటాయి. ఆరోగ్యానికి చర్మ సౌందర్యానికి కలబంద చాలా బాగా పని చేస్తుంది.
Also Read: Koushik Reddy: కొంపముంచిన ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. అమ్ముడుపోయిన ఎనిమిది మంది ఎంపీలు?




















