
Chiranjeevi: చిరంజీవి గురించి ఇప్పటివరకు సహాయం చేయడం అన్న మాట తప్ప మోసం చేయడం అన్నమాట ఎక్కడా కూడా వినిపించలేదు. అలాంటిది ఓ డైరెక్టర్ ని మాత్రం చాలా దారుణంగా మోసం చేశారట.కానీసం పేరు కూడా తలుచుకోకుండా చిరంజీవి మాట్లాడిన మాటలు ఆ డైరెక్టర్ ని తీవ్ర మనోవేదనకి గురిచేసాయి. మరి ఆ డైరెక్టర్ ఎవరు..చిరంజీవి వల్ల ఎందుకు అవమానంగా ఫీల్ అయ్యాడు అనేది చూస్తే.. చిరంజీవికి హిట్ సినిమాలు అందించిన డైరెక్టర్లలో కోదండరామిరెడ్డి ఒకరు.వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి.
Director shocking comments on Chiranjeevi
అలాగే చిరంజీవి సినీ కెరీర్ ని టర్న్ చేసిన ఖైదీ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కూడా వీరి కాంబోలోనే వచ్చింది.అయితే అలాంటి హిట్ పెయిర్ అయినటువంటి వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది.ఎందుకంటే చిరంజీవి ఓ సందర్భంలో మాట్లాడుతూ.. మీకు హిట్ ఇచ్చిన డైరెక్టర్లు, మీకు పేరు తెచ్చి పెట్టిన డైరెక్టర్లు ఎవరు అని అడగగా ఎంతో మంది దర్శకుల పేర్లు చెప్పారు కానీ తనతో పాటు 23 సినిమాలు తీసిన కోదండరామిరెడ్డి పేరు మాత్రం చెప్పలేదు.(Chiranjeevi)
Also Read: Anushka: అనుష్క జీవితాన్ని సంకనాకించేసిన సినిమా.!
అయితే ఈ విషయంలో కోదండరామిరెడ్డి చాలా అవమానంగా ఫీల్ అయ్యారు. అలా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు చిరంజీవి నా పేరు చెప్పనందుకు చాలా బాధపడ్డాను. ఎందుకంటే దాదాపు ఆయనతో కలిసి 23 సినిమాలు చేశాను. అలాంటిది ఆయనకు పేరు తెచ్చి పెట్టిన డైరెక్టర్లలో నా పేరు లేకపోవడం చాలా బాధనిపించింది. నిజంగా ఆయన మాట్లాడిన మాటల విషయంలో నేను చాలా బ్యాడ్ గా ఫీల్ అయ్యాను.

ఏది ఏమైనప్పటికీ చిరంజీవి అలా మాట్లాడాల్సి ఉండకూడదు. ఆయన మాటలకి నేను చాలా నొచ్చుకున్నాను. ఆయనకు నేను దర్శకత్వం వహించిన 23 సినిమాల్లో చాలా హిట్స్ వచ్చాయి.అలాంటిది నన్ను మర్చిపోవడం నిజంగా నన్ను అవమానించినట్టే అంటూ చెప్పుకోచ్చారు. అలాగే ఈ విషయంలో కూడా పార్టీలు మారారా అని యాంకర్ అడగగా.. అవును పార్టీ మారినట్టే అనిపిస్తుంది అంటూ కోదండరామిరెడ్డి అన్సర్ ఇచ్చారు.(Chiranjeevi)





