
OG Movie: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు.. ఇన్ని సంవత్సరాల పాటు ఆయన నుంచి సినిమా కోసం వెయిట్ చేసినటువంటి ఫ్యాన్స్ కు ఓజి సినిమా మంచి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పవచ్చు.. ఈ దెబ్బతో పవన్ కళ్యాణ్ రేంజ్ మరో లెవల్ కి వెళ్ళిపోయింది. మరి పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇంతలా పెరిగిపోవడానికి ప్రధాన కారకుడు ఈ చిత్ర డైరెక్టర్.. సుజిత్ వయసులో చిన్నవాడైనా కానీ సినిమాలు తీయడంలో అనుభవం ఉన్న వ్యక్తుల కంటే ఎక్కువగా ఆలోచిస్తాడు.
The wife of the OG Movie director is more beautiful than the heroine
అలాగే సినిమాలో కూడా ఆ విధంగానే ప్రజెంటేషన్ ఉంటుంది. అందుకే ఆయన తీసిన ఒకటి రెండు చిత్రాలు అయినా సరే సూపర్ హిట్ కొట్టాయి. అలా సుజిత్ లోని టాలెంట్ ను గమనించినటువంటి పవన్ కళ్యాణ్ పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకొని హిట్ కొట్టారని చెప్పవచ్చు.. మరి అలాంటి సుజిత్ డైరెక్షన్ చూసాము, కానీ ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ తెలియదు.. ఆయన 17 సంవత్సరాల వయసులోనే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినీ కెరియర్ లోకి అడుగు పెట్టాడు..(OG Movie)
Also Read: OG Movie USA Review: “ఓజి మూవీ యూఎస్ఏ రివ్యూ”.. మైండ్ బ్లాక్ అయ్యే కామెంట్స్.!
ఈయన తీసిన మొదటి చిత్రం రన్ రాజా రన్.. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఏకంగా ప్రభాస్ తో సాహో చిత్రాన్ని చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సుజిత్ కు పవన్ కళ్యాణ్ పిలిచి మరి ఓజీ సినిమా డైరెక్షన్ అప్పగించారు. అలాంటి ఈయన మొదట చార్టెడ్ అకౌంట్ కావాలనుకున్నారట.కానీ సినిమాల మీద మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చారు.

ఇక ఈయన 2020లో ప్రవళక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అయితే వీరు ముందుగా ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి మరీ వివాహం చేసుకున్నారు. ప్రవళిక కూడా వృత్తిపరంగా పెద్ద వైద్యురాలు. ఈ విధంగా కెరియర్ లో ఇద్దరు అద్భుతంగా సెట్ అయిపోయారు. తాజాగా ఓజి సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రవళిక రావడంతో సుజిత్ అభిమానులు చాలా సంబరపడిపోయారు. హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(OG Movie)





Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ని అవమానించిన నిహారిక..!