
Ind vs Pak: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా చాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఏకంగా ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. దీంతో తొమ్మిదవ సారి ఆసియా కప్ 2025 టోర్నమెంట్ గెలుచుకుంది. Ind vs Pak
Ind vs Pak Pakistan captain insults Mohsin Naqvi
ఛాంపియన్ గా నిలిచిన టీమిండియా కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా మొహ్సిన్ నఖ్వీ ఉన్న నేపథ్యంలో… అతడే ట్రోఫీ అందించాల్సి ఉంటుంది. దీంతో అతని చేతిలో మీదుగా ట్రోఫీని తీసుకోకూడదని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియా ప్లేయర్లు ట్రోఫీని అందుకోలేదు. కానీ పాకిస్తాన్ ప్లేయర్లకు మెడల్స్ తో పాటు రన్నరప్ చెక్ అందించారు మొహ్సిన్ నఖ్వీ. Ind vs Pak
Also Read: Abhishek Sharma: గిల్ కు ఎసరు…సారా టెండుల్కర్ ను ఫాలో అవుతున్న అభిషేక్ శర్మ…
అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అందించిన రన్నరప్ చెక్ అందుకున్న పాకిస్తాన్ టీం కెప్టెన్ సల్మాన్ అఘా కాస్త ఓవర్ గా రియాక్ట్ అయ్యాడు. ఇచ్చిన చెక్ ను కింద పడేశాడు. ఏసీసీ పెద్దలు అందరూ స్టేజ్ పైన ఉన్నప్పుడే…. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా ఈ పని చేశాడు. దీంతో ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా పై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. Ind vs Pak
Also Read: Popula Pette: పోపుల పెట్టెలో ఈ వస్తువులను ఉంచుతున్నారా.. అయితే డేంజర్ లో ఉన్నట్టే…




















