
Pala Pitta: దసరా పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ పండుగను చాలా గ్రాండ్ గా నిర్వహిస్తారు. ముఖ్యంగా దసరా పండుగ రెండు తెలుగు… రాష్ట్రాలలో బాగా పాపులారిటీ… తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో సుక్క ముక్కతో దసరా పండుగ చేసుకుంటారు. Pala Pitta
Why should you watch Pala pitta on Dussehra
అదే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం… పూర్తిగా విభిన్నంగా ఈ పండుగను చేసుకుంటారు. ఆరోజు నాకు చుక్క ముక్క లేకుండానే… పూర్తిగా స్వీట్లు అలాగే వెజ్ తో నడిపిస్తారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో దసరా రోజున.. ఉదయం పాలపిట్టను చూసి ఆ తర్వాత జమ్మి పెట్టుకుంటూ ఉంటారు. జమ్మి చెట్టుకు పూజ చేసిన అనంతరం ఒకరికొకరు జమ్మి ఆకు పెట్టుకుంటారు. ఇది ఒక ఆనవాయితీగా వస్తోంది. అయితే దసరా రోజున పాలపిట్ట చూస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. Pala Pitta
Also Read: Wine: దసరా వస్తోందని పీకదాకా తాగుతున్నారా… అయితే ఏ స్టఫ్ తీసుకోవాలి.. ఎంత తాగాలి..వివరాలు…
దసరా పండుగ అనేది శ్రీరాముడు అలాగే పాండవులకు విజయాన్ని కలిగించిందట. శ్రీరాముడు… దసరా రోజునే రావణాసురుడి పైకి యుద్ధానికి వెళ్ళాడట. ఆ సమయంలో శ్రీరాముడికి పాలపిట్ట ఎదురైనట్లు చెబుతారు. ఈ నేపథ్యంలోనే శ్రీరాముడు విజయం సాధిస్తాడు. అటు పాండవులకు కూడా.. పాలపిట్ట దర్శనమైన తర్వాత విజయం… లభించిందని పురాణాలు చెబుతున్నాయి. దీంతో పాలపిట్ట విజయానికి సూచికగా మారిపోయింది. ఎలాంటి కష్టాలు ఉన్న పాలపిట్టను దసరా రోజు చూస్తే తొలగిపోతాయట. అందుకే దసరా రోజు పాలపిట్టను చూడాలని పెద్దలు చెబుతూ ఉంటారు.
Also Read: Abhishek Sharma: అఫ్రిది పరువు తీసిన అభిషేక్ శర్మ..రూ.33 లక్షల కారుతోనే


