Abhishek Sharma: అభిషేక్ శర్మ ఇంట పెళ్లి సందడి

Abhishek Sharma: ఆసియా కప్ 2025 టోర్నమెంటులో అద్భుతంగా రాణించిన అభిషేక్ శర్మ పెళ్లి సందడి మొదలైంది. అభిషేక్ శర్మకు కోమల్ అనే చెల్లెలు ఉన్న సంగతి తెలిసిందే. ఆమె వివాహాన్ని తాజాగా పంజాబ్ లో నిర్వహించినట్లు చెబుతున్నారు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ముగ్గేగానే కోమల్ శర్మ వివాహం జరిపించారు అభిషేక్ శర్మ కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా… హల్దీ అలాగే వెడ్డింగ్ ఫోటోలు వైరల్ గా మారాయి. మొదటిగాతన చెల్లెలు హల్దీ ఫంక్షన్ లో అభిషేక్ శర్మ పాల్గొని… ఫోటోలు దిగాడు. Abhishek Sharma

Abhishek Sharma with his sister in her Mehndi function

ఆ తర్వాత ఇదే ఫంక్షన్కు యువరాజ్ సింగ్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తన గురువుతో పాటు అభిషేక్ శర్మ స్టెప్పులు కూడా వేశాడు. దీంతో అభిషేక్ శర్మ చెల్లెలు పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా ఆసియా కప్ 2025 టోర్నమెంటు నేపథ్యంలో దాదాపు 300 కు పైగా పరుగులు చేసిన అభిషేక్ శర్మ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలవడం జరిగింది. Abhishek Sharma

Also Read: Abhishek Sharma: అఫ్రిది పరువు తీసిన అభిషేక్ శర్మ..రూ.33 ల‌క్ష‌ల కారుతోనే

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లోనే కాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో ప్రతిసారి హైదరాబాద్ జట్టు తరఫున ఉతికి ఆరేస్తున్నాడు. బౌలర్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి బౌలింగ్లో కూడా సిక్సులు కొట్టగలిగే.. సత్తా సంపాదించుకున్నాడు అభిషేక్ శర్మ. ఇలా సిక్సులు కొట్టడం వెనుక యువరాజ్ సింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అతని సారథ్యంలోనే బ్యాటింగ్ నేర్చుకున్నాడు అభిషేక్ శర్మ. Abhishek Sharma

Also Read: Sprouts: మొలకలను ఏ సమయంలో తినాలి…అతిగా తింటే ప్ర‌మాదామా…ఇవి తెలుసుకోండి?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_