Rahul Ramakrishna: సారే రావాలంటున్నాడే.. కేసీఆర్ ఏ కావాలంటున్నారే.. రాహుల్ రామకృష్ణ సంచలన పోస్ట్ ?

Rahul Ramakrishna: తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్… పేరును జనాలు.. ఏమాత్రం మర్చిపోవడం లేదు. ఏదైనా పండుగ అయితే చాలు కెసిఆర్ పాటలు పెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు. దీనికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి… దాదాపు రెండు సంవత్సరాలు అయినా కూడా హామీలు నెరవేర్చక పోవడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆరు గ్యారంటీలు అని గారడీ చేసింది కాంగ్రెస్ పార్టీ అని… అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు జనాలు అలాగే రాజకీయ విశ్లేషకులు. Rahul Ramakrishna

Actor Rahul Ramakrishna Sensational Tweet on KCR

ఇలాంటి నేపథ్యంలో కెసిఆర్ పాలన బాగుందని చాలామంది తెలంగాణ వాదులు కూడా స్పష్టం చేస్తున్నారు. టీవీ డిబేట్లో కూర్చొని మరీ కేసీఆర్ను వ్యతిరేకించిన వారు ఇప్పుడు ఆయనను మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ చేసిన పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అతని పోస్టు కారణంగా.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి. హైదరాబాద్ పని అయిపోయింది.. కెసిఆర్ పాలనే బాగుంది… మళ్లీ సారే రావాలి… అంటూ రాహుల్ రామకృష్ణ చేసిన పోస్ట్.. వైరల్ అయింది. ఈ పోస్టు పెట్టడమే కాకుండా కెసిఆర్ తో పాటు కేటీఆర్ ను కూడా రాహుల్ రామకృష్ణ ట్యాగ్ చేశాడు. Rahul Ramakrishna

Also Read: Jammi Chettu: దసరా నాడు జమ్మి చెట్టుకు ఎందుకు పూజలు చేస్తారు.. దీని రహస్యం

అయితే పోస్ట్ పెట్టిన గంట తర్వాత… ట్విట్టర్ అకౌంటును డిలీట్ చేశాడు రాహుల్ రామకృష్ణ. అతని ట్విట్టర్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని అతను కూడా.. సోషల్ మీడియా ద్వారా చెప్పినట్లు సమాచారం అందుతోంది. అయితే జనాలు మాత్రం ఈ విషయాన్ని ఏమాత్రం నమ్మడం లేదు. రాహుల్ రామకృష్ణ కావాలని ఆ పోస్ట్ పెట్టి… తన అకౌంట్ హ్యాక్ అయిందని తప్పుడు సమాచారం అందిస్తున్నారనీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. అయితే రాహుల్ రామకృష్ణ ట్విట్టర్ ను కేటీఆర్ టీం హ్యాక్ చేసి ఇలా చేసిందని కాంగ్రెస్ వాదులు ఫైర్ అవుతున్నారు. మొత్తానికి రాహుల్ రామకృష్ణ చేసిన ఈ ఒక్క పోస్టు… దసరా రోజున దీపావళి పండుగను చూపించినట్లు అయింది. Rahul Ramakrishna

Also Read: PCB Chief Mohsin Naqvi: బీసీసీఐకి భయపడని మొహ్సిన్ నఖ్వీ.. ఏం చేస్తారో చేసుకోండి…

Share your love