Malla Reddy: పవన్ కళ్యాణ్ కి విలన్ గా మల్లారెడ్డి.. భారీ రెమ్యూనరేషన్ ఫిక్స్.. ఉస్తాద్ భగత్ సింగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Malla Reddy Villain role in Ustad Bhagath Singh

Malla Reddy: ఏంటి ఇది నిజమేనా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి విలన్ గా బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి నటిస్తున్నారా.. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉందే అనుకుంటారు ఈ విషయం తెలిసిన చాలామంది నెటిజన్లు.. అయితే మీరు వింటున్నది నిజమే. ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ కి విలన్ గా హరీష్ శంకర్ మల్లారెడ్డిని ఫిక్స్ చేశారట. దీని గురించి మాట్లాడడం కోసం మల్లారెడ్డి కాలేజీకి వెళ్లి గంటసేపు స్క్రిప్ట్ కూడా చెప్పారట డైరెక్టర్ హరీష్ శంకర్.

Malla Reddy Villain role in Ustad Bhagath Singh

అంతే కాదు ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించినందుకుగానూ మల్లారెడ్డి కి మూడు కోట్ల రెమ్యూనరేషన్ కూడా ఫిక్స్ చేశారట. అయితే ఈ విషయాలన్నీ రూమర్లు కాదు. స్వయంగా మల్లారెడ్డి తాజా ఇంటర్వ్యూలో ఆయన నోటితో బయటపెట్టిన నిజాలు.. అయితే ఈ విషయం విని చాలామంది తెగ సంబరపడిపోతుంటారు. కానీ మరొక్క ట్విస్ట్. అదేంటంటే..ఈ సినిమాలో మీరు అనుకున్నట్లు మల్లారెడ్డి నటించడం లేదు. హరీష్ శంకర్ వెళ్లింది కలిసింది నిజమే. (Malla Reddy)

Also Read: Rashmika: అన్నీ ఆన్లైన్ లో పెట్టాలా.. ఆ విషయంపై ఫైర్ అయిన రష్మిక.!

కానీ ఆయన ఈ సినిమాలో నటించనని చెప్పారట. తనకి ఈ పాత్ర సెట్ అవ్వదు అని కూడా మల్లారెడ్డి చెప్పారట.అంతేకాదు ఈ సినిమా గురించి చెబుతూ.. ఇంటర్వెల్ కు ముందు నేను హీరోని తిడితే ఇంటర్వెల్ తర్వాత హీరో నన్ను తిట్టి కొడతాడు. కానీ ఈ సినిమాలో విలన్ పాత్ర నాకంత కంఫర్టబుల్గా ఉండదు అని రిజెక్ట్ చేశాను అంటూ మల్లారెడ్డి చెప్పుకోచ్చారు. ఇక మల్లారెడ్డి మాటలతో చాలామంది నెటిజన్స్ ఉస్తాద్ భగత్ సింగ్ లో మల్లారెడ్డి నటించి ఉంటే బాగుండేది.

Malla Reddy Villain role in Ustad Bhagath Singh

సినిమాకి మరింత హైప్ వచ్చేది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికి ఎంతో కామెడీ చేసే మల్లారెడ్డి ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తే బాగుండు అని ఈ విషయం తెలిసిన పలుగురు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి గబ్బర్ సింగ్ కాంబో మరోసారి రిపీట్ కావడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.(Malla Reddy)

Share your love