
Hardik Pandya-Mahieka Sharma: టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హార్దిక్ పాండ్యా క్రికెట్ పరంగా ఎన్నో విజయాలను సాధించాడు. కానీ తన వైవాహిక జీవితంలో మాత్రం నిరాశే ఎదురయింది. హార్దిక్ పాండ్యా తన మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు. హార్దిక్ పాండ్యా 2020లో మోడల్ నటాషా స్టాంకోవిక్ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అదే సంవత్సరంలో వారికి ఓ కుమారుడు కూడా జన్మించారు. ఇక నాలుగు సంవత్సరాల అనంతరం నటాషా, హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం వారి కుమారుడి బాధ్యతలను ఇద్దరం తీసుకుంటామని పేర్కొన్నారు. విడాకుల తర్వాత హార్దిక్ పాండ్యా ఎన్నో రకాల ట్రోల్స్ ఎదుర్కొన్నారు. హార్దిక్ పాండ్యా సింగర్ జాస్మిన్ వాలియాతో రిలేషన్ కొనసాగించినట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. హార్దిక్, జాస్మిన్ వివాహం కూడా చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా అనేక రకాల వార్తలు వచ్చాయి. Hardik Pandya-Mahieka Sharma
Hardik Pandya confirms relationship with Mahieka Sharma
దానికి తగినట్లుగానే వారిద్దరూ చాలా సందర్భాలలో కలిసి కనిపించారు. వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సైతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అనంతరం ఏమైందో తెలియదు వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా తన కొత్త గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి ముంబై ఎయిర్ పోర్టులో కలిసి కనిపించారు. వీరిద్దరూ ఒకే కారులోంచి దిగి లోపలికి వెళ్తున్న వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అలాగే తనతో దిగిన ఫోటోలు కూడా పంచుకున్నాడు. దీంతో మహికా శర్మనే పాండ్యా కొత్త ప్రియురాలు అంటున్నారు. Hardik Pandya-Mahieka Sharma
Also Read: TDP: టీడీపీ నాయకులకు నకిలీ వీడియో కాల్స్..చంద్రబాబు, దేవినేని ఉమ ఫోటోలతో !
ఇక అప్పటినుంచి హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మ గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. మహిక శర్మ ప్రసిద్ధ మోడల్. ఆమె అనేక మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ లలో కలిసి పనిచేసింది. అనేక పెద్ద బ్రాండ్లతో కలిసి పనిచేసింది. ఇండియన్ ఫ్యాషన్ అవార్డులలో “మోడల్ ఆఫ్ ది ఇయర్” గా కూడా ఎంపికయింది. మహికా శర్మకు ఇన్ స్టాగ్రామ్ లో 50 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా, మహికా శర్మ రిలేషన్ లో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ విషయంపైన హార్దిక్ పాండ్యా ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటకు రాదు. Hardik Pandya-Mahieka Sharma
Also Read: Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్.. సరైన




















