Wine Shop: మందుబాబులకు షాక్.. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే వైన్స్ ఓపెన్?

Wine Shop
Wine Shop

Wine Shop: తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్న సంగతి తెలిసిందే. ఏ పండుగ జరిగిన సరే తెలంగాణలో మద్యం తాగడం మాత్రం పక్కా. ఎవరైనా చనిపోయిన లేదా ఎవరైనా జన్మించిన, ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా సరే కచ్చితంగా దావత్ ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగానే వచ్చిన చుట్టాలకు మద్యం తాగించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే పెళ్లిళ్లు, ఫంక్షన్లో జరిగిన కూడా ఆ మద్యం ఏరులై పారుతుంది. ప్రతి ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు కచ్చితంగా మద్యం సేవిస్తారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు విపరీతంగా ఉంటాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సరికొత్త వాదన తెరపైకి తీసుకువచ్చారు.

Shock for drug addicts Wine Shop open only from 4 pm to 9 pm

ప్రస్తుతం మద్యం టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో టైమింగ్స్ పై సంచలన ప్రకటన చేశారు. మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాలను సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు మాత్రమే నడిపించాలని ఆయన ఆదేశాలు ఇస్తున్నారు. వైన్ షాపులు ఊరి బయట మాత్రమే ఉండాలని అలాగే అక్కడ కూర్చుని తాగడానికి సిట్టింగుకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వబోనని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. Wine Shop

Also Read: Neem: ఇంటివద్ద వేప చెట్టు పెరుగుతుందా…అయితే, ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి !

బెల్ట్ షాపులకు మందు అమ్మకూడదని కూడా ఆదేశాలు జారీ చేశారు.వైన్ షాపులో యజమానులు అందరూ కలిసి సిండికేట్ చేయకూడదని కూడా వెల్లడించారు. తన మునుగోడు నియోజకవర్గంలో ఈ రూల్ కచ్చితంగా అమలు చేస్తానని ప్రకటించారు. తన పదవి పోయినా సరే దీనికోసం పోరాడుతానని వివరించారు. ఈ పాలసీలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతానని ఆయన స్పష్టం చేశారు. దీంతో మునుగోడు నియోజకవర్గంలో ఉన్న మద్యం అలాగే బెల్ట్ షాపు ఓనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మందుబాబులు కూడా కాస్త నిరాశకు లోనవుతున్నారు. ఎమ్మెల్యే ఇలా తగలడ్డాడు అని ఫైర్ అవుతున్నారు. Wine Shop

Also Read: Dhanashree Verma: మొగుడ్ని వ‌దిలేశాక కోట్లు సంపాదిస్తున్న ధ‌న శ్రీ వ‌ర్మ‌..ఆ ప‌నులు చేసి…

Share your love