
Deepika Padukone: బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. దానికి కారణం ఆమె పలు వివాదాల్లో చిక్కుకోవడమే. ముఖ్యంగా సినిమాలకు తాను కేటాయించిన సమయంలో మాత్రమే వర్క్ చేస్తానని చెప్పడంతో రెండు పెద్ద సినిమాల నుండి ఆమెను తీసేశారు.
Deepika Padukone comments that everything is her choice
అయితే అలాంటి దీపిక పదుకొనే తాజాగా మరో వార్తతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు. పెళ్లికి ముందు శృంగారం అంటూ ఈమె చేసిన బోర్డు కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా నిలిచాయి. మరి ఇంతకీ దీపిక పదుకొనే పెళ్లికి ముందు శృంగారం గురించి అని ఎందుకు మాట్లాడింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.(Deepika Padukone)
Also Read: Bandla Ganesh: “ఏం పీకావ్”.. నిర్మాతకి బండ్ల గణేష్ కౌంటర్.!
బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో లైంగిక సంబంధాల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. నేను పెళ్లికి ముందు సెక్స్ చేస్తానా.. లేక పెళ్లి తర్వాత శృంగారం చేస్తానా అనేది పూర్తిగా నా ఇష్టం.. అలాగే ఒక అబ్బాయిని నిజంగానే ప్రేమించానా.. లేక ఆకర్షణలో పడ్డానా అనేది నిర్ణయించుకోవాల్సింది కూడా నేనే..

అలాగే బిడ్డను కనాలా కనకూడదా అని నిర్ణయించుకోవాల్సింది కూడా నేనే..అంటూ లైంగిక సంబంధాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక దీపిక పదుకొనే రణవీర్ సింగ్ ని పెళ్లి చేసుకొని దువా అనే పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.(Deepika Padukone)





