Naresh: నా సినిమా చిరంజీవి మూవీకి జలక్ ఇచ్చింది.. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న నరేష్.!

Naresh says my film gave a Shock to Chiranjeevi movie

Naresh: సీనియర్ నటుడు నరేష్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన ఒకప్పుడు ఎన్నో సినిమాలతో నటుడిగా రాణించారు.అలా కామెడీ సినిమాలకు పెట్టింది పేరుగా ఉండే నరేష్ ప్రస్తుతం చాలా సినిమాల్లో తండ్రి, అన్న, మామయ్య వంటి పాత్రలు పోషిస్తున్నారు.అయితే అలాంటి నరేష్ కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట చెక్కర్లు కొడుతుంది. ఆ వీడియోలో నరేష్ పవిత్ర లోకేష్ తో పాటు అలీ కూడా ఉన్నారు.

Naresh says my film gave a Shock to Chiranjeevi movie

ఆ సమయంలో చిరంజీవి గ్యాంగ్ లీడర్ మూవీ గురించి నరేష్ చెబుతూ.. చిరంజీవి గ్యాంగ్ లీడర్ మూవీ విడుదలైన సమయంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే అదే సమయంలో విడుదల కావాల్సిన నా చిత్రం భళారే విచిత్రం సినిమాకి కొన్ని సమస్యలు వచ్చాయి. ఈ మూవీలో నేను పూర్తిగా లేడీ గెటప్ లో నటించేసరికి కొంతమంది బయ్యర్లు సినిమా కొనడానికి ఆలోచన చేశారు. (Naresh)

Also Read: Bandla Ganesh: “ఏం పీకావ్”.. నిర్మాతకి బండ్ల గణేష్ కౌంటర్.!

దాంతో నా సినిమా షూటింగ్ పూర్తయ్యాక కూడా మూడు నెలలు సినిమా ఎవరు కొనకపోవడంతో ఆగిపోయింది.కానీ గ్యాంగ్ లీడర్ మూవీ వచ్చిన నెల రోజులకి చిత్రం భళారే విచిత్రం సినిమా విడుదలైంది. అయితే ఆ సమయానికి గ్యాంగ్ లీడర్ హవా ఇంకా తగ్గలేదు. కానీ ఎప్పుడైతే నా చిత్రం భళారే విచిత్రం సినిమా థియేటర్లోకి వచ్చిందో ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ మూవీకి బ్రేకులు పడ్డాయి.

Naresh says my film gave a Shock to Chiranjeevi movie

చాలామంది నా సినిమా చూశారు. సినిమా విడుదలైన రోజు నుండి హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి.నా సినిమాకి అంత రెస్పాన్స్ వస్తుందని నేను కూడా ఊహించలేదు అంటూ పవిత్ర లోకేష్ ముందు తన గొప్పలు చెప్పుకున్నారు నరేష్.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో చిరు ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.(Naresh)

Share your love