
Jubilee Hills Bypoll: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టే రాజకీయాలు కొనసాగుతున్నాయి. మాగంటి గోపీనాథ్ మృతి నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహించనున్నారు ఎన్నికల అధికారులు. నవంబర్ 14వ తేదీన రిజల్ట్ ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మూడు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేశాయి. గులాబీ పార్టీ నుంచి మాగంటి సునీత బరిలో ఉండగా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ఉన్నారు. అటు భారతీయ జనతా పార్టీ నుంచి దీపక్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పాతవాళ్లే. కానీ గులాబీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మాగంటి సునీత మాత్రం కొత్త అభ్యర్థి. ఆమెకు రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేదు. Jubilee Hills Bypoll
Jubilee Hills Bypoll update brs vs congress
కేవలం సెంటిమెంట్తో రాజకీయాల్లోకి వస్తున్నారు. అయితే గ్రౌండ్ రిపోర్టు ప్రకారం మాగంటి గోపినాథ్కు మంచి పేరు ఉంది. ఆయన భార్య బరిలో ఉన్నప్పటికీ ఓటు వేసేందుకు ఎక్కువ శాతం మంది ఓటర్లు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో అధికార పార్టీకి కొంత మంది మొగ్గు చూపిస్తున్నారు. నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి చాలా ప్లస్ అయ్యాడట. వరుసగా అతడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఓడిపోయిన నేపథ్యంలో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నారు. అయితే ఆయన నేర చరిత్ర పెద్ద మైనస్ అయింది. రౌడీ షీటర్ అంటూ అతనిపై ట్రోలింగ్ చేస్తున్నారు. రౌడీ షీటర్ అంటూ గులాబీ పార్టీ మాత్రం గ్రౌండ్ స్థాయిలో బాగా ప్రచారం చేస్తోంది. దానికి తోడు హరీష్ రావు అలాగే కేటీఆర్ ఇద్దరు కూడా కృష్ణార్జునుల లాగా కాంగ్రెస్కు చుక్కలు చూపిస్తున్నారు. Jubilee Hills Bypoll
Also Read: Drinking Water: నీళ్లు నిలబడి తాగితే, ప్రమాదమేనా..అయితే ఇవి తెలుసుకోండి?
ప్రస్తుతానికైతే గులాబీ పార్టీకి 3 పర్సెంటేజ్ ఓట్ షేర్ ఎక్కువగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. అయితే ఎన్నికల సమయానికి పోల్ మేనేజ్మెంట్ చేయగలిగితే కాంగ్రెస్ కు విజయం దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ గులాబీ పార్టీ అభ్యర్థుల మధ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుందని చెప్పవచ్చు. భారతీయ జనతా పార్టీ అసలు బరిలో లేనట్లే తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీకి ముస్లిం పార్టీ మద్దతు పలకడంతో మరింత అడ్వాంటేజ్ నవీన్ యాదవ్ కు ఉంటుంది. అయితే మొత్తం ముస్లింలు కాంగ్రెస్కు వేసే పరిస్థితి కూడా లేదని అంటున్నారు. చాలావరకు హైదరాబాదులో ముస్లింలు కేసీఆర్ కు పట్టం కట్టారు. కెసిఆర్ కావాలని పదేపదే జపం చేస్తున్నారు హైదరాబాదు ప్రజలు. కాబట్టి ఈ రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఖాయమని అంటున్నారు. Jubilee Hills Bypoll
Also Read: Jowar Roti: రోజు జొన్న రొట్టె తింటున్నారా…అయితే జాగ్రత్త





