
Revanth Reddy: తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎన్నికను గెలుచుకోవడం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సమర రంగంలోకి దిగాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి ఇది వ్యక్తిగత ప్రతిష్ఠ పోరాటంగా మారింది.
Revanth Reddy leads Jubilee Hills campaign
సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా మంత్రులకు division-wise responsibilities కేటాయించారు. ప్రతి ఇంటికి చేరేలా door-to-door campaign plan సిద్ధం చేశారు. ప్రచారం చివరి రోజులలో రేవంత్ స్వయంగా road shows, public meetingsలో పాల్గొననున్నారు. రేపు ఢిల్లీ పర్యటన అనంతరం ఆయన పార్టీ నేతలతో ముఖ్య సమావేశం జరపనున్నారు.
ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన నేతలకు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ ప్రచారానికి కౌంటర్ వ్యూహాలు సూచించారు. మరోవైపు బీజేపీ కూడా ప్రముఖ నేతలను ప్రచారంలోకి దించే ప్రయత్నం చేస్తోంది.
తాజా survey reports అన్ని పార్టీలకు తలనొప్పిగా మారాయి. ఏ పార్టీ గెలుస్తుందో అంచనా వేయడం కష్టమవుతోంది. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే decisive battleగా మారింది.





హరీష్ రావు పార్టీ మారుతున్నారా? జీవన్ రెడ్డి రాకతో మొదలైన అంతర్గత పోరు!!