
Congress: మూడు నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలుతుందని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు నానా కష్టాలు పడుతోంది. ఆదాయ మార్గాలు అన్వేషించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. 6 గ్యారంటీలు అని ఒక్క గ్యారెంటీ కూడా సరిగ్గా అమలు చేయడం లేదని జనాలు కూడా ఫైర్ అవుతున్నారు. Congress
Congress government will collapse in 3 months
దానికి తోడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రుల మధ్య రోజుకో గొడవ తెరపైకి వస్తోంది. కమిషన్ల విషయంలో కూడా ఈ గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. తనకు మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చి, రేవంత్ రెడ్డి సర్కార్ తప్పిందని బహిరంగంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. Congress
Also Read: Jubilee Hills Bypoll: కేసీఆర్ కు కొత్త టెన్షన్…జూబ్లీహిల్స్‌లో ‘కారు’ను పోలిన ఫ్రీ సింబల్స్…
ఇలాంటి నేపథ్యంలో మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాబోయే మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చబోతున్నాడని బాంబు పేల్చారు.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో 30 నుంచి 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కూడా వివరించారు. రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు అయిపోయాయి… ఇక ఆయన ఇంట్లో కూర్చోవడం మంచిది అని సెటైర్లు పేల్చారు దిలీప్ కుమార్. Congress
Also Read: Kobbari Kaya: కొబ్బరికాయతో ఇలా పూజ చేస్తే, కోటీశ్వరులు కావడం పక్కా ?





