Nara Dishti: రోడ్డుపై పడేసిన నిమ్మకాయలను తొక్కితే ఏం జరుగుతుందో తెలుసా…?

Nara Dishti : మూడు బాటల నడుమ అసలు నడవకూడదు. రోడ్డుపైన కొంతమంది నిమ్మకాయలు మిరపకాయలు, కోడిగుడ్లు, కుంకుమ, పసుపు కలిపిన వస్త్రాలు, అన్నం పడేస్తూ ఉంటారు. అయితే ఇలాంటివి కనిపించినప్పుడు వాటి నుంచి దాటకూడదు. ఈ విషయాన్ని పూర్వకాలం నుంచి పెద్దలు చెబుతూనే ఉంటారు. అయితే ఇలా చెప్పడానికి గల అసలు కారణం ఏమిటి అని ఎవరు ఆలోచించరు. పూర్వకాలంలో జ్యోతిష్యం, భక్తి, శాస్త్రం అన్ని కలగల్సిన జీవన విధానం ఉండేది. చెడు శక్తులు దరిచేరకుండా ఉండాలని నిమ్మకాయలు, మిరపకాయలు, పసుపు, కుంకుమ కలిపిన వస్త్రాలు, అన్నం దిష్టి తీసే పద్ధతి ఉండేది. దిష్టి తీయడం పూర్తయిన తర్వాత వీటిని తీసుకువెళ్లి మూడు రోడ్ల నడుమన పడేసేవారు. అవి చెడు శక్తులను తీసివేస్తాయని నమ్ముతారు. Nara Dishti

Nara Dishti Do you know what happens if you step on lemons that have fallen on the road

అందుకే అలాంటి వాటిని తొక్కిన లేదా దాటిన అందులో ఉన్న దుష్టశక్తి, దిష్టి మన మీదకు వస్తుంది. దీనివల్ల అనేక రకాల చెడు ప్రభావాలు కలుగుతాయని పెద్దలు నమ్ముతారు. మూడు బాటలు దగ్గర దయ్యాలు తిరుగుతాయనే మాటలు కూడా పూర్వకాలం నుంచే వచ్చాయి. పాతకాలంలో వెలుతురు ఉండేది కాదు. పూర్తిగా చీకటితో నిండి ఉండేది. జంతువులు, పాములు, పక్షులు తిరుగుతూ ఉండేవి. వాటి నుంచి రక్షించేందుకు ప్రజలను భయపెట్టి దూరంగా ఉంచే ప్రయత్నం చేయడానికి దయ్యాలు అనే మాటను చెప్పి భయపెడతారు. Nara Dishti

Also Read: Jubilee Hills Bypoll: కేసీఆర్ కు కొత్త టెన్ష‌న్‌…జూబ్లీహిల్స్‌లో ‘కారు’ను పోలిన ఫ్రీ సింబల్స్…

ఆ నమ్మకానికి వెనుక భయపెట్టే పద్ధతిలో ఇచ్చిన హెచ్చరిక రోడ్డుపైన ఉన్న నిమ్మకాయలు, కాలిన కట్టెలు, వెంట్రుకలు, చనిపోయిన జంతువు, గాజులు, పసుపు, కుంకుమ, కర్పూరం, నల్ల దుస్తులు, అన్నం వీటిపై అస్సలు దాటకూడదు. వీటివల్ల చెడు గ్రహాల ప్రభావం లేదా దుష్టశక్తుల ప్రభావం చేరుతుంది. శాస్త్రీయంగా చూసినట్లయితే వీటికి సంబంధించి నిర్ధారిత ఆధారాలు అసలు లేవు. కానీ మిరపకాయలు, నిమ్మకాయలు తొక్కితే వాటి రసాయనాలు చర్మానికి ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆహార భద్రత, పరిశుభ్రత దృష్ట్యా వీటిని తొక్కకపోవడమే మంచిదని పండితులు చెబుతున్నారు. Nara Dishti

Also Read: Kobbari Kaya: కొబ్బరికాయతో ఇలా పూజ చేస్తే, కోటీశ్వరులు కావడం పక్కా ?

Share your love