Komatireddy Rajgopal Reddy: నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి అవుతా

Komatireddy Rajgopal Reddy
Komatireddy Rajgopal Reddy
Komatireddy Rajgopal Reddy

Komatireddy Rajgopal Reddy: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న వచ్చిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో మిక్స్డ్ రిజల్ట్ అందుకున్న కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాకిచ్చారు. మంత్రి పదవి కోసం చాలా రోజుల నుంచి అడుగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి అవుతానంటూ సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. Komatireddy Rajgopal Reddy

Komatireddy Rajgopal Reddy on minister or cm post congress

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా రోజుల నుంచి మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నారు. అసలు సిసలు కాంగ్రెస్ వాదిని తానేనని.. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అందరికీ మంత్రి పదవి వస్తోంది కానీ తనకు మాత్రం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. Komatireddy Rajgopal Reddy

Also Read: Telangana: రేవంత్ స్కెచ్‌..తెలంగాణలో ఆ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ?

ఈ తరుణంలోనే త్వరలోనే మంత్రి అవుతాను.. లేకపోతే ముఖ్యమంత్రి అవుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు మునుగోడు చూసుకోండి నేను తెలంగాణ చూసుకుంటా అంటూ వ్యాఖ్యానించారు. మర్యాదగా నాకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వండి.. లేదా నేనే లాక్కుంటా అంటూ హెచ్చరించారు. దీంతో ఒక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. Komatireddy Rajgopal Reddy

Also Read: KTR: సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలో బీఆర్ఎస్ విజయకేతనం

Leave a Comment