
KCR: తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ పార్టీని తెలంగాణ ప్రజలు ఓడించారు. అయితే ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. KCR
Dance to KCR song in AP
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు పెద్దగా నెరవేర్చలేదు. దీంతో జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మళ్లీ కెసిఆర్ రావాలి.. సీఎం కావాలని తెలంగాణ ప్రజలు నిత్యం మీడియా ముందు మొత్తుకుంటున్నారు. అంతేకాదు, తెలంగాణ ఏ పండగ జరిగినా కేసీఆర్ పాటలు పెట్టేస్తున్నారు. కేసీఆర్ రావాలంటున్నారు. KCR
Also Read: Jubilee Hills Bypoll: కేసీఆర్ కు కొత్త టెన్షన్…జూబ్లీహిల్స్‌లో ‘కారు’ను పోలిన ఫ్రీ సింబల్స్…
అయితే, ఇప్పుడు కేసీఆర్ పాట ఏపీకి కూడా తాకింది. ఏపీలో కేసీఆర్ పాటకు డాన్స్ చేసిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపరలో నిన్న జరిగిన గ్రామ పండుగలో కేసీఆర్ పాటకు స్టెప్పులేశారు యువతులు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. KCR
Also Read: Kobbari Kaya: కొబ్బరికాయతో ఇలా పూజ చేస్తే, కోటీశ్వరులు కావడం పక్కా ?





