
Prabhas: ప్రభాస్ అంటే ఇష్టపడని అమ్మాయి ఎవరుంటారు చెప్పండి..ప్రభాస్ ని చూస్తే ఎవరైనా సరే లవ్ లో పడిపోవాల్సిందే. అయితే అలాంటి ప్రభాస్ కి దేశవ్యాప్తంగా ఎంతోమంది లేడీ అభిమానులు ఉన్నారు. ఆయనకు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రభాస్ అంటే ఇష్టపడే వాళ్ళలో మామూలు జనాలే కాదు హీరోయిన్లు కూడా ఉన్నారు. అలా ప్రభాస్ ఓ సినిమా చేసే సమయంలో ఆ సినిమా హీరోయిన్ ప్రభాస్ ని ప్రేమిస్తున్నానని ఏకంగా లవ్ లెటర్ ఇచ్చేసిందట.
Heroine love letter to Prabhas Director is serious
ఇక విషయంలోకి వెళ్తే.. ప్రభుదేవా దర్శకత్వం వహించిన సినిమాలలో ప్రభాస్ నటించిన పౌర్ణమి మూవీ కూడా ఒకటి.ఈ మూవీలో ప్రభాస్ హీరోగా నటించగా త్రిష,చార్మి కౌర్లు హీరోయిన్లుగా నటించారు. అయితే ఇది మనకు తెలిసిన విషయమే. కానీ తెలియని మరొక విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో చార్మి ప్లేస్ లో మొదట వేరే హీరోయిన్ ని తీసుకున్నారట చిత్ర యూనిట్. ఆ హీరోయిన్ తో కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారట.కానీ ఆ తర్వాత ఆ హీరోయిన్ ప్రభాస్ పట్ల చూపించే అతి ప్రేమ వారికి నచ్చలేదట. (Prabhas)
Also Read: Tamannaah: కడుపు మండిపోతుంది.. 5 లక్షల కోసం అలాంటి పని.. తమన్నాపై హీరోయిన్ వల్గర్ కామెంట్స్.!
ముఖ్యంగా ప్రభాస్ ని ప్రేమిస్తున్నానని చెప్పి సమయం దొరికితే చాలు ఆయనతో కూర్చొని విసిగిస్తూ ఆయన్ని ప్రేమిస్తున్నానని వెంటపడేదట.ఆ హీరోయిన్ చేసే బాగోతం మొత్తం చిత్ర యూనిట్ అందరూ చూసి విసిగిపోయారట.ఇక ఓ రోజు నేరుగా ప్రభాస్ కి లవ్ లెటర్ ఇవ్వడంతో ప్రభాస్ ఇక్కడితో చాలు ఇక ఆపు అని ఆమెకు వార్నింగ్ ఇచ్చి నేరుగా ప్రభుదేవా దగ్గరికి వెళ్లి వెంటనే మీరు ఈ సినిమాలో హీరోయిన్ ని మార్చండి.

లేకపోతే నేనే తప్పకుంటా అని చెప్పారట.దాంతో డైరెక్టర్ సీరియస్ అయ్యి ఆ హీరోయిన్ ని మార్చేసి ఆమె ప్లేస్ లో చార్మిని తీసుకున్నారట. ఇక అప్పట్లో ఈ విషయం తెగ వైరల్ అయింది. అయితే ప్రస్తుతం ఆ హీరోయిన్ కి పెళ్లి అయిపోవడంతో ఆ హీరోయిన్ పేరు ఇక్కడ చెప్పుకోవడం బాగుండదు కాబట్టి మెన్షన్ చేయడం లేదు. కానీ అప్పట్లో ఈ హీరోయిన్ ప్రభాస్ కి లవ్ లెటర్ రాసినట్టు తెగ వార్తలు వినిపించాయి.(Prabhas)





