
Nagarjuna: ఏంటి నాగార్జున కాపురంలో గొడవలు రావడానికి కారణం ఆ సినిమా నేనా.. ఆ సినిమా సమయంలోనే ఆయన పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయిందా.. ఇంట్లో గొడవలకు బీజం పడింది ఆ సినిమా సమయంలో నేనా అనేది ఇప్పుడు చూద్దాం.తాజాగా శివ మూవీ రీ రిలీజ్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్న సందర్భంలో మరో న్యూస్ కూడా అభిమానులను ఆకర్షిస్తుంది. అదే నాగార్జున అమలల ప్రేమ కథ..
Did the rift in Nagarjuna Kapuram start with that movie
ఇక నాగార్జున అమల కాంబినేషన్లో వచ్చిన మొదటి మూవీ కిరాయి దాదా..ఈ సినిమా 1987లో వచ్చింది. అయితే ఈ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య కేవలం పరిచయం మాత్రమే ఉందట.కానీ ఎప్పుడైతే శివ మూవీలో నటించారో అప్పటినుండి వీరి మధ్య సాన్నిహిత్యం మరింత ఎక్కువైంది. అలా శివ మూవీ నాగార్జున అమలలని కలిపినట్టు ఆ మధ్యకాలంలో ఎన్నో వార్తలు వినిపించాయి. (Nagarjuna)
Also Read: RGV: “శివ” కోసం చాలా కుట్రలు.. నాగార్జునతో అబద్ధాలు.. ఆర్జీవి షాకింగ్ కామెంట్స్.!
అలా శివ మూవీతో వీరి మధ్య బంధం ఏర్పడడంతో నాగార్జున తన మొదటి భార్య దగ్గుబాటి లక్ష్మి కి విడాకులు ఇచ్చి 1990లో విడిపోయారు.ఆ తర్వాత మొదటి భార్యకి విడాకులు ఇచ్చిన రెండేళ్లకే అంటే 1992లో అమలని రెండో పెళ్లి చేసుకున్నారు.అలా వీరిద్దరిని శివ మూవీ కలిపిందని,శివ మూవీ షూటింగ్ సమయంలో అమల తో ప్రేమలో పడడం వల్లే నాగార్జున దగ్గుబాటి లక్ష్మీకి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకొని ఆమెకు విడాకులు ఇచ్చారనే వార్తలు అప్పట్లో ఎన్నో వినిపించాయి.

అయితే ఇప్పుడు శివ మూవీ రీ రిలీజ్ కారణంగా మరోసారి నాగార్జున మొదటి భార్యతో విడాకుల న్యూస్ వైరల్ అవుతుంది. అలా శివ మూవీ సమయంలోనే నాగర్జున కాపురంలో గొడవలు మొదలయ్యాయని కొంతమందిని నెటిజన్స్ మరోసారి ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.(Nagarjuna)





