

Dharmendra: హేమమాలిని ధర్మేంద్ర వీరిద్దరిది ప్రేమ వివాహం అనే సంగతి మనకు తెలిసిందే.. అయితే హేమ మాలినికి ఇది మొదటి పెళ్లే అయినప్పటికీ ధర్మేంద్రకు మాత్రం రెండో పెళ్లి. ధర్మేంద్ర మొదట ప్రకాష్ కౌర్ ని పెళ్లి చేసుకొని నలుగురు పిల్లలకు కూడా జన్మనిచ్చారు. అలా నలుగురు పిల్లలు పుట్టినప్పటికి కూడా ధర్మేంద్రకే హేమ మాలిని మీద ప్రేమ పెరిగింది.అయితే వీరిద్దరూ కలిసి పలు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. అలా వరుస సినిమాలు చేయడంతో వీరిద్దరూ ప్రేమలో పడిపోయారు.
What did Dharmendra do after setting aside Hinduism to marry Hema Malini
అలా ధర్మేంద్ర మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే హేమమాలినిని పెళ్లి చేసుకున్నారు. అది కూడా ఇస్లాం మతంలోకి మారి. అయితే హిందూ ధర్మం ప్రకారం మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోవడానికి లేదు. కానీ ఇస్లాం మతంలో మాత్రం నాలుగు పెళ్లిళ్ల వరకు చేసుకోవచ్చు. అందుకే ధర్మేంద్ర హిందూ మతాన్ని పక్కనపెట్టి ఇస్లాం మతంలోకి మారి హేమమాలినిని రెండో పెళ్లి చేసుకున్నారు.(Dharmendra)
Also Read: Tollywood: టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు
అలా హేమమాలిని పై ఉన్న విపరీతమైన పిచ్చి ఆయన్ని ఏకంగా మతం మారే వరకు తీసుకువచ్చింది.ఇక ధర్మేంద్ర మతం మారాక తన పేరుని ఏకంగా దిలావర్ ఖాన్ కేవల్ కృష్ణగా మార్చుకున్నారు. అలాగే హేమమాలిని కూడా తన పేరుని ఐషా బి ఆర్ చక్రవర్తిగా మార్చుకుంది. అలా ఇద్దరు ఇస్లాం మతంలోకి మారి పెళ్లి చేసుకున్నారు. ఇక ధర్మేంద్ర గత కొద్ది రోజుల నుండి శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

అలా రీసెంట్ గా హాస్పిటల్ కి తీసుకువచ్చి మళ్ళీ ఇంటికి తీసుకువెళ్లగా సడన్గా మళ్లీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో ఆయన్ని హాస్పిటల్ కి తీసుకువచ్చారు. ఈ నేపథంలోనే ధర్మేంద్ర ట్రీట్మెంట్ తీసుకుంటుండగానే ఆయన చనిపోయినట్టు పలు మీడియా సంస్థలు వార్తలు క్రియేట్ చేయడంతో దీనిపై హేమమాలిని ఆమె కూతురు ఈశా ఫైర్ అయ్యారు.(Dharmendra)







