Dharmendra: ధర్మేంద్ర అంత్యక్రియలపై కొత్త అనుమానం.. ఏం జరుగుతుంది.?

New suspicion over Dharmendra funeral

Dharmendra: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర తాజాగా మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఆయన మరణ వార్త విని ఒక్కసారిగా ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. ఆయన మరణ వార్తతో బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే ఎంతోమంది ఆయన భౌతిక దేహానికి నివాళులు అర్పించడానికి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ధర్మేంద్ర అంత్యక్రియలపై కొత్త అనుమానాలు తలెత్తాయి.

New suspicion over Dharmendra funeral

అదేంటంటే.. ఎవరైనా పాపులర్ వ్యక్తులు చనిపోతే ఖచ్చితంగా వారిని కుటుంబ సభ్యులు,మిగిలిన వారి సందర్శనార్ధం ఇంట్లో ఉంచుతారు. కానీ ధర్మేంద్ర మృతదేహాన్ని మాత్రం ఇంట్లో ఉంచకుండా నేరుగా స్మశాన వాటికకి తీసుకువెళ్లడంతో కొత్త అనుమానాలకు తెరలేపాయి. ముఖ్యంగా ధర్మేంద్ర భార్య, కూతురు కూడా స్మశాన వాటికకే తెలుపు రంగు దుస్తులను ధరించి చేరడంతో ఇది కాస్త బాలీవుడ్లో సంచలనంగా మారింది.(Dharmendra)

Also Read: Dharmendra: ధర్మేంద్ర కన్నుమూత.. డిశ్చార్జ్ అయిన కొన్ని రోజులకే మళ్ళీ అలా.!

ఎందుకు ధర్మేంద్రని మృతదేహాన్ని ఇంటి వద్ద ఉంచకుండా నేరుగా స్మశాన వాటికకు తీసుకువచ్చారు.అంత పెద్ద పేరున్న నటుడి భౌతిక దేహాన్ని చూడడానికి ఎంతో మంది తరలివస్తారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన్ని ఇలా నేరుగా స్మశాన వాటికకు ఎందుకు తీసుకువచ్చారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ముంబైలోని పవన్ హాన్స్ స్మశాన వాటిక దగ్గరికి ధర్మేంద్ర మృతదేహాన్ని తీసుకువెళ్లారట.

New suspicion over Dharmendra funeral

అక్కడికే హేమమాలిని తో పాటు అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, అభిషేక్ బచ్చన్లతో పాటు బాలీవుడ్ లోని కొంతమంది ప్రముఖులు, ఆయనతో కలిసి నటించి నటీనటులు అక్కడికి చేరుకున్నారట.దీంతో ఎందుకు ఇలా స్మశానవాటికకి తీసుకువచ్చారు అనే ప్రశ్న తలెత్తుతుంది.(Dharmendra)

Share your love