
Balakrishna: నందమూరి బాలకృష్ణ గురించి ఎప్పుడు ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటుంది. రాజకీయాల గురించి అయినా లేదా సినిమాల గురించి అయినా ఆయన ఇండస్ట్రీలో హాట్ టాపిక్.. అయితే అలాంటి బాలకృష్ణ కి సంబంధించి తాజాగా ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ బాలయ్య బాబు నువ్విక మారవా అంటూ ట్రోల్ చేస్తున్నారు.మరి ఇంతకీ బాలకృష్ణని ట్రోల్ చేయడానికి కారణం ఏంటి.. ఆయన చేసిన తప్పేంటి అనేది ఇప్పుడు చూద్దాం.
Trolls on Balakrishna on social media
నందమూరి బాలకృష్ణ నటించిన తాజా మూవీ అఖండ-2 డిసెంబర్ 5న భారీ అంచనాలతో విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ మొదలు పెట్టేసారు.తాజాగా ఈ సినిమాకి సంబంధించిన లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ లిరికల్ వీడియో రిలీజ్ ఈవెంట్ ముంబైలో గ్రాండ్ గా నిర్వహించారు.అయితే ఈ ఈవెంట్లో కొంతమంది బాలకృష్ణ అభిమానులు ఆయనతో ఫోటోలు దిగడం కోసం అత్యుత్సాహం కనబరిచారు.(Balakrishna)
Also Read: Actress: 80 కేజీల హీరో మీద పడుకొని.. వద్దన్నా వినలేదు.. నటి షాకింగ్ కామెంట్స్.!
దాంతో స్టేజి మీదకి బాలకృష్ణతో ఫోటోలు దిగడానికి వచ్చిన అభిమానులపై బాలకృష్ణ కన్నెర్ర చేస్తూ వారికి వార్నింగ్ ఇచ్చారు. ఏంట్రా అలా మీద పడిపోతారు అంటూ బాలకృష్ణ వారిపై ఫైర్ అవుతూ కన్నెర్ర చేసిన వీడియోలు ఫోటోలు నెట్టింట వైరల్ గా మారడంతో ఇవి చూసిన నెటిజెన్స్ బాలకృష్ణ నువ్వు మారవా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే బాలకృష్ణ ఎక్కడికి వెళ్లినా సరే తన అభిమానులపై ఇలాగే కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు.

ఏ హీరో అభిమాని అయినా సరే అభిమాన హీరోతో సెల్ఫీలు, ఫోటోలు దిగడం కోసం అత్యుత్సాహం కనబరుస్తారు. అలా బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా ఆయనతో ఫోటోలు దిగడానికి అత్యుత్సాహం కనబరిస్తే బాలకృష్ణ వారిని ఓపికతో రిసీవ్ చేసుకోకుండా వారిపై అరుస్తూ కోపాన్ని ప్రదర్శిస్తారు.అయితే ఇలాంటి హీరో ఎవరు ఉండరని అభిమానులు అభిమానాన్ని అర్థం చేసుకొని హీరో నువ్వొక్కడివే అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.(Balakrishna)





Balakrishna: “నేను డూప్లికేట్ హీరోని కాదు”.. బాలకృష్ణ సెటైర్లు ఆ హీరో పైనేనా.?