
Winter Bath: ప్రస్తుతం చలికాలం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలైనా తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ లలో విపరీతంగా చలి తీవ్రత ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ఏజెన్సీ ప్రాంతాలలో అయితే ఐదు నుంచి ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతను మాత్రమే నమోదు అవుతున్నాయట. తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదు అవుతున్నాయట. Winter Bath
Winter Bath Benefits is good for health, know why
అయితే ఇలాంటి నేపథ్యంలో చాలామంది రెండు రోజులకు ఒకసారి స్నానం చేస్తూ ఉంటారు. మరి కొంతమంది వారానికి ఒకసారి చలి భయానికి స్నానం చేయడం చూస్తూ ఉంటాం. అయితే చలి విపరీతంగా ఉన్న నేపథ్యంలో స్నానం చేయడం మానేస్తే ప్రమాదమట. స్నానం చేయకపోతే శరీరంపై చెమట పేరుకుపోయి అలర్జీలకు దారితీస్తుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. Winter Bath
Also Read: KCR: “గద్ద ముక్కు” అంటూ కేసీఆర్ పై రెచ్చిపోయిన ఏపీ మంత్రి.. BRS అదిరిపోయే…
దానివల్ల చర్మం నుంచి దుర్వాసన వచ్చి ఇతరుల దృష్టిలో మనం చాలా చులకన అవుతూ ఉంటాం. అలాగే జుట్టులో డాండ్రఫ్ విపరీతంగా పెరుగుతుందట. చర్మ సంబంధిత అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. నిత్యం తప్పనిసరిగా స్నానం చేయాలని వైద్యులు చెబుతున్నారు. అలా చేస్తేనే ఇలాంటి రోగాలు రావాలని సూచనలు చేస్తున్నారు. చలికాలంలో కచ్చితంగా స్నానం చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు. Winter Bath
Also Read: YS Jagan: హైదరాబాద్ లో జగన్ ఎంట్రీ..రప్పా రప్పా పోస్టర్ల కలకలం


