
Danam Nagender: తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక అనివార్యం అయ్యేలా కనిపిస్తోంది. పదిమంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తుది దశకు వచ్చింది. ఎలాగైనా ఎమ్మెల్యేలపై వేటుపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ లిస్టులో ముందుగా దానం నాగేందర్ పైన కోర్టు వెయిట్ వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇది గమనించిన రేవంత్ రెడ్డి అదిరిపోయే స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. Danam Nagender
Danam Nagender may resign khairatabad bypoll
మొన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక గెలిచిన ఉత్సాహంలో ఉన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు దానం నాగేందర్ తో రాజీనామా చేయించడానికి సిద్ధమయ్యారట. అతనితో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారట. ప్రభుత్వం తమదే కనుక జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో గెలిచినట్లుగానే, ఖైరతాబాద్ నియోజకవర్గంలో గెలుస్తామన్న ధైర్యంతో రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారట. మరోసారి దానం నాగేందర్ కు టికెట్ ఇచ్చి గెలిపించాలని స్కెచ్ వేస్తున్నారట. Danam Nagender
Also Read: YS Jagan: హైదరాబాద్ లో జగన్ ఎంట్రీ..రప్పా రప్పా పోస్టర్ల కలకలం
అయితే తెలంగాణలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైతే పిజెఆర్ కొడుకు విష్ణు బరిలో ఉండే ఛాన్సులు ఉన్నాయి. అతనికి మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆయన తండ్రి ఓట్లు మొత్తం విష్ణుకు పడే ఛాన్స్ ఉంటుంది. గతంలో గులాబీ పార్టీ అక్కడే గెలిచింది. పిజెఆర్ కూతురు విజయారెడ్డి కాంగ్రెస్ లో ఉంది కాబట్టి ఆమెకు టికెట్ వచ్చే ఛాన్స్ లేదు. ఆమెను కూడా గులాబీ పార్టీ ఆహ్వానించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అన్నా- చెల్లెలు ఇద్దరు కలిసి ఖైరతాబాద్ నియోజకవర్గంలో దూకుడుగా ప్రచారం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే గులాబీ పార్టీ విజయం సాధించడం ఖాయమని అంచనా వేస్తున్నారు. అటు ప్రభుత్వ బలగంతో మరోసారి ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని రేవంత్ రెడ్డి స్కెచ్ లు వేస్తున్నారట. మరి ఎవరు గెలుస్తారో చూడాలి. Danam Nagender
Also Read: KCR: “గద్ద ముక్కు” అంటూ కేసీఆర్ పై రెచ్చిపోయిన ఏపీ మంత్రి.. BRS అదిరిపోయే…





