
Pawan Kalyan: తెలంగాణ వాళ్లవి దిష్టి కండ్లు అంటూ ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారం రేపుతూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గత పది రోజుల కింద ఈ వ్యాఖ్యలు చేయగా ఇప్పుడు ఒక్కొక్కరు కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్ లు పెట్టి అతనికి కౌంటర్ ఇస్తున్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తాజాగా స్పందించారు. వెంటనే క్షమాపణలు చెప్పానని, లేకపోతే సినిమాటోగ్రఫీ మంత్రిగా తానే పవన్ కళ్యాణ్ సినిమాలను ఆపేస్తానని వార్నింగ్ ఇచ్చారు. Pawan Kalyan
Pawan Kalyan movies ban in jadcherla
దీంతో ఈ అంశం మరింత రాజుకుంది. ఇలాంటి నేపథ్యంలో జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరో సంచలన వీడియో విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు అనిరుద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు జడ్చర్లలో ఆడనివ్వమని తేల్చి చెప్పారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా థియేటర్ల ఓనర్లకు వార్నింగ్ ఇస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. తెలంగాణ వాళ్లు ఏం పీకలేరు అనుకుంటున్నారా ? మిగతా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ సినిమాలను ఆడని వద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హెచ్చరించారు. Pawan Kalyan
Also Read: PM MODI: భారత పౌరులకు బిగ్ షాక్..ప్రధాని మోదీ అతిపెద్ద కుట్ర..?
మరి ఇంత జరుగుతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు స్పందించలేదు. సోషల్ మీడియా వేదికగా అయినా ఒక వీడియో విడుదల చేసి క్షమాపణలు చెబితే అయిపోయేదని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. కానీ జనసేన కార్యకర్తలు మాత్రం రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అసలు క్షమాపణలు చెప్పబోడు అన్న రీతిలో సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తున్నారు జనసేన వారియర్స్. Pawan Kalyan
Also Read: Komatireddy Venkat Reddy: సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా..పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడవు





