
Pawan Kalyan: తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశించి ఇటీవల డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వాళ్లవి దిష్టి కండ్లు అంటూ బాంబు పేల్చారు. దీంతో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి తెలంగాణ మంత్రులు ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ నేతలతో పాటు గులాబీ పార్టీ నేతలు కూడా మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలను తెలంగాణలో ఆడనివ్వమని స్వయంగా సినిమా ఆటోగ్రాఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తేల్చి చెప్పారు. Pawan Kalyan
Jana Sena shop closed in Telangana Pawan kalyan says goodbye to Hyderabad
తెలంగాణకు క్షమాపణలు చెప్పినా, చెప్పకపోయినా సినిమాలు ఆడనివ్వమని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. గులాబీ పార్టీ నేతలు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. ఇంత వివాదం జరుగుతున్న జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు. ఒక పోస్ట్ ద్వారా క్షమాపణలు కూడా చెప్పడానికి సిద్ధంగా ఆయన లేనట్టే తెలుస్తోంది. Pawan Kalyan
Also Read: Revanth Reddy: సీఎం రేవంత్ కు జర్నలిస్ట్ వెన్నుపోటు..బీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్ గా ?
అయితే, పవన్ కళ్యాణ్ ఇలాగే వ్యవహరిస్తే తెలంగాణలో రాష్ట్రంలో జనసేన పార్టీ దుకాణం బంద్ కాబోతున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ వాళ్లను తిట్టి ఇక్కడ పార్టీ నడిపిస్తామంటే అసలు ఊరుకోబోమని సాటి ప్రజానీకం కూడా అంటోంది. అటు తెలంగాణ జనసేన పార్టీ నేతలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ ఈ అంశంపై క్లారిటీ ఇస్తేనే తెలంగాణ రాష్ట్రంలో జనసేన బతుకుతుందని అంటున్నారట. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి. Pawan Kalyan
Also Read: Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోనున్న పవన్ కళ్యాణ్ ?





