

AP Liquor: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో సంచలన విషయం బయటపడింది. ఏపీలో ఇంటింటికి మద్యం డెలివరీ చేస్తున్న సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కల్తీ మద్యం ఇప్పుడు ఇంటి వద్దకే అన్న రేంజ్ లో ఏపీలో వ్యాపారం కొనసాగుతోంది. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో ఈ సంఘటన బయటపడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మద్యం ఏరులై పారుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామస్థాయిలో కూడా మద్యం అమ్ముకునేలా పర్మిషన్స్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. AP Liquor
AP Liquor Door-to-door liquor delivery in AP
అయితే ఈ నేపథ్యంలోనే ఏపీలో ఇంటింటికి మద్యం డెలివరీ చేస్తున్న సంఘటన బయటకు వచ్చింది. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో లేబుళ్లు లేని మధ్యాన్ని ఇంటింటి సరఫరా చేస్తున్నారు కొంత మంది వ్యాపారులు. ఇంటింటికి మద్యం సరఫరా జరుగుతున్న పట్టి పట్టనట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం మద్యం న్యాయంగా విక్రయించి డబ్బులు సంపాదించుకోమని పర్మిషన్స్ ఇచ్చారు. AP Liquor
Also Read: Kalvakuntla Kavitha: పవన్ కళ్యాణ్ పరువు తీసిన కవిత..ఆయన ఎప్పుడూ సమైక్యావాదినే
కానీ కొంతమంది అక్రమార్కులు మాత్రం.. దీన్ని దొడ్డి దారిన వినియోగించుకుంటున్నారు. ఇంటింటికి మద్యం డెలివరీ అన్న పేరుతో లేబుల్స్ లేని మధ్యాన్ని విక్రయిస్తున్నారు. ఇక అది బంగారం అన్న రేంజిలో మందుబాబులు కొనుగోలు చేసి అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనిపై వైసీపీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వెంటనే ఈ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తోంది జగన్ ప్రభుత్వం. AP Liquor
Also Read: Akhanda 2: వివాదంలో అఖండ 2 సినిమా…సీపీఐ నారాయణ వివాదస్పద వ్యాఖ్యలు ?
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





