

PM MODI-KCR: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆరోగ్యం పై దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన చాలా రోజుల నుంచి అసెంబ్లీ అలాగే బయటకు రావడంలేదని ప్రధాని నరేంద్ర మోడీ గులాబీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులతో చర్చించారట. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది..? అంత సెట్ అయిందా అంటూ పేర్కొన్నారు అంట. నేను అడిగినట్లు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు చెప్పండి.. ఎప్పటిలాగే ఆయన జనాల్లో తిరగాలని కోరారు ప్రధాని నరేంద్ర మోడీ. PM MODI-KCR
PM MODI on KCR health in telangana
ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. కెసిఆర్ అలాగే నరేంద్ర మోడీ ఇద్దరు బద్ద శత్రువులు. అలాంటి ప్రధాని నరేంద్ర మోడీ కేసీఆర్ ఆరోగ్యం పై ఆరా తీయడం ఇప్పుడు చర్చ నియాంశమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఓ ప్రచారం మొదలుపెట్టింది. కెసిఆర్ అలాగే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పొత్తు పెట్టుకుని పోటీ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. వీళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటేనని చెప్పే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. PM MODI-KCR
Also Read: Kolikapudi Srinivasa Rao: మరో వివాదంలో కొలికపూడి శ్రీనివాస్ రావు… ఏకంగా అధ్యక్షుడిపై హాట్
ఇక అటు ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీయడంపై గులాబీ పార్టీ నేతలు ఎవరు స్పందించలేదు. కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ఇవాళ స్వయంగా కేసీఆర్ మాట్లాడే ఛాన్సులు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా నిన్న రాత్రి.. ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి తాను ఆరోగ్యంగా ఉన్నాను అనే సంకేతం ఇచ్చారు కేసీఆర్. హైదరాబాదులోని నంది నగర్ లో ఉన్న తన నివాసానికి కెసిఆర్ దంపతులు ఇద్దరు రావడం జరిగింది. మోడీ చేసిన ఒక్క కామెంట్ నేపథ్యంలో… కెసిఆర్ బయటకు వచ్చారని అంటున్నారు. అయితే ఎన్నికల సమయానికి ఎవరు పొత్తు పెట్టుకుంటారో తెలియని పరిస్థితి నెలకొందని విశ్లేషకులు చెబుతున్నారు. PM MODI-KCR
Also Read: Jagan-KCR: పెను సంచలనం..తాడేపల్లి నివాసం వద్ద జగన్, కేసీఆర్, కేటీఆర్ కటౌట్






