

Sampath Kumar: రూ. 8 కోట్లు కమిషన్ ఇవ్వకుంటే చంపి పారేస్తామని అలంపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సంపత్ బరితెగించినట్లు వార్తలు వస్తున్నాయి. మారణాయుధాలతో బెదిరించి నేషనల్ హైవే44 కాంట్రాక్ట్ పనులను ఆపాడట సంపత్. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు కావడంతో FIR నమోదు చేయకుండా కంప్లైంట్ లెటర్ దాస్తున్నారట పోలీసులు. గద్వాల జిల్లా బీచుపల్లి – అలంపూర్ నేషనల్ హైవే 44 పై 6 లేన్ల పనులను భ్రమర ఇన్ ఫ్రా దక్కించుకున్నారు. Sampath Kumar
Sampath Kumar news goes viral
ఈ పనులు జరగాలంటే తనకు రూ.8 కోట్ల కమిషన్ డబ్బులు ఇవ్వాలంటూ జనవరి 6న రోడ్డు పనులు జరుగుతున్న స్థలానికి TS33E6768 అనే నంబరు గల కారులో వచ్చి మారణాయుధాలతో సంపత్ అనుచరుడు ఆకేపోగు పీటర్సన్ బెదిరించినట్లు గులాబీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాంట్రాక్ట్ పనులు ఆపేసి బెదిరింపులపై పోలీసులకు భ్రమర ఇన్ ఫ్రా సంస్థ అధిపతి జగదీష్ ప్రసాద్ ఫిర్యాదు చేశాడట. ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేతల నుండి ఆదేశాలు రావడంతో కేసు నమోదు చేయకుండా, ఫిర్యాదు కాపీలను మాయం చేశారట పోలీసులు. Sampath Kumar
Also Read: Janasena-BJP: జనసేనకు తెలంగాణ బిజెపి షాక్…ఛీ కొట్టిన అధ్యక్షుడు ?
కేంద్ర నిధులతో జరిగే నేషనల్ హైవే పనుల్లో కూడా కమిషన్లు కావాలంటూ సంపత్ ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నియోజకవర్గంలోని తుంగభద్ర నది నుండి అక్రమంగా భారీ ఎత్తున ఇసుక రవాణా చేయనుందట. ఒక్కో టిప్పర్ నుండి నెలకు రూ.10 లక్షలు వసూలు చేస్తున్నారట సంపత్. పోలీసులే దగ్గరగా ఉండి అక్రమ ఇసుక రవాణా చేస్తునట్లు వార్తలు వస్తున్నాయి. Sampath Kumar
Also Read: Harish Rao: మొన్న అల్లు అర్జున్, నిన్న ప్రభాస్…రెచ్చిపోయిన హరీష్ రావు ?







