

Kavvampally Satyanarayana: మానుకోండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వివాదంలో చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కవ్వంపల్లి Vs కరీంనగర్ సీపీ అన్నట్లుగా రాజకీయాలు కొనసాగుతున్నాయని గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తాను పోస్టింగ్ ఇప్పించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవద్దని కరీంనగర్ సీపీకి హుకుం జారీ చేసినట్లు మానుకోండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై ఆరోపణలు వస్తున్నాయి. Kavvampally Satyanarayana
Manukondur MLA Kavvampally Satyanarayana controversy
ఇటీవల ఎస్ఐపై ఫిర్యాదులు రావడంతో విచారణకు ఆదేశించి, క్రమశిక్షణ ఉల్లంఘన కింద అటాచ్ చేసేందుకు కరీంనగర్ సీపీ ఆలం గౌస్ సిద్ధయ్యారట. తాను పోస్టింగ్ ఇప్పించిన ఎస్ఐపై చర్యలు ఎలా తీసుకుంటావని సీరియస్ అయ్యారట కవ్వంపల్లి. అంతేకాదు, మంత్రి పొన్నం ప్రభాకర్ వద్దకు వెళ్లి సీపీ ఆలంపై ఫిర్యాదు చేసినట్లు కవ్వంపల్లి సత్యనారాయణపై విమర్శలు వస్తున్నాయి. Kavvampally Satyanarayana
Also Read: Sampath Kumar: 8 కోట్లు కమిషన్ ఇవ్వకుంటే చంపి పారేస్తాం..వివాదంలో కాంగ్రెస్ నేత ?
దీంతో తమ అంతర్గత విషయాల్లో సిబ్బందిపై చర్యలు తీసుకుంటుంటే ఇంత మంది అడ్డుపడతారా అని ఎస్ఐను సస్పెండ్ చేయడం జరిగిందట. అనంతరం సెలవులపై వెళ్ళిపోయిన సీపీ ఆలం..అందుబాటులోకి రాలేదట. అటాచ్‌మెంట్‌తో వెళ్లిపోయేదాన్ని కవ్వంపల్లి అనవసరపు రాద్దాంతంతో సస్పెండ్ అయ్యానని అసహనంలో సదరు ఎస్ఐ ఉన్నారట. తమ అంతర్గత వ్యవహారాల్లో రాజకీయ నాయకుల జోక్యం ఏంటని సీపీ ఆలం తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. Kavvampally Satyanarayana
Also Read: Congress: 6 జిల్లాలను తిరిగి కలిపి ఉమ్మడి వరంగల్ జిల్లాగా చేయండి ?







