
Deepak Case: ఆ లేడీ ఎఫెక్ట్… కండక్టర్లు, ప్రయాణికులు వినూత్న నిరసన చేపట్టారు. కేరళలో ఆర్టీసీ బస్సులో అట్టపెట్టెలను కండక్టర్లు, ప్రయాణికులు ధరించారు. ఇటీవల బస్సులో వ్యక్తి తనని అసభ్యంగా తాకాడని ఓ యువతి వీడియో పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఆ అవమానం భరించలేక సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. Deepak Case
Deepak Case Conductors and passengers wearing cardboard boxes
ఈ నేపథ్యంలోనే కేరళ ఆర్టీసీ బస్సులో వినూత్న ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా, కేరళలో వ్యక్తి మరణానికి కారణమైన మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది, కోజికోడ్ –బస్సులో దీపక్ అనే వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ తాకాడని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది ఓ మహిళ. Deepak Case
ఆ వీడియో వైరల్ కావడంతో అవమాన భారంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు దీపక్.
దీపక్‌ను ఆత్మహత్యకు పురిగొల్పిందని మహిళపై కోజికోడ్ మెడికల్ కాలేజీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. Deepak Case
Also Read: Telangana: బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డంకు సుప్రీంకోర్టు నోటీసులు




