
TDP: తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతినిధి దీపక్ రెడ్డి గురించి తెలియని వారు ఉండరు. ఎప్పుడు టీవీ డిబేట్లో కనిపిస్తూ.. తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమి నాయకులను జోకుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మొన్న ఎయిర్ ఇండియా విషయంలోనూ ఇంగ్లీష్ ఛానల్ డిబేట్లో మాట్లాడి అడ్డంగా దొరికిపోయారు దీపక్ రెడ్డి. ఎయిర్ ఇండియా సమస్యలు నారా లోకేష్ తీర్చబోతున్నట్లు తప్పుడు వ్యాఖ్యలు చేశారు. TDP
TDP deepak reddy comments on pm modi
ఈ నేపథ్యంలోనే ఆర్నాబ్ గోస్వామి ఓ ఆట ఆడుకున్నారు. అయితే ఈ సంఘటన మరువకముందే తెలుగుదేశం పార్టీ ప్రతినిధి దీపక్ రెడ్డి… మరోసారి బుక్ అయ్యాడు. ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు దీపక్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రతిపక్ష మహిళా ఎంపీలు కొరికే అవకాశం ఉందంటూ హాట్ కామెంట్స్ చేశారు. పార్లమెంటులో ఆయుధాలు తీసుకుపోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి.. ప్రతిపక్ష మహిళలందరూ ఏకమై ప్రధాని నరేంద్ర మోడీని కొరుకుతారని విధ్వంసకర వ్యాఖ్యలు చేశారు దీపక్ రెడ్డి. TDP
Also Read: Harish Rao: కేసీఆర్ జాతిపిత.. రేవంత్ రెడ్డి బూతుపిత
దీపక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో డిబేట్లో పాల్గొన్న సభ్యులతో పాటు యాంకర్ కూడా షాక్ అయింది. ప్రధాని నరేంద్ర మోడీని కొరకడమేంటని దీపక్ రెడ్డి పరువు తీశారు సదరు యాంకర్. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ సభ్యులు దాడి చేసే ప్రమాదం ఉందని.. ఇంటలిజెన్స్ ఇటీవల పేర్కొన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. TDP
Also Read: Jeevan Reddy: కరీంనగర్ కు రేవంత్ రెడ్డి.. జీవన్ రెడ్డి ఘోర అవమానం ?





